News May 25, 2024

26న కడపలో అండర్ 16 పురుషుల క్రికెట్ ఎంపికలు

image

మే 26 ఉదయం 7 గంటలకు కడపలోని రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో U-16 పురుషుల క్రికెట్ ఎంపికలు జరుగుతాయని జిల్లా క్రికెట్ కార్యదర్శి రెడ్డి ప్రసాద్ తెలిపారు. ఎంపికల్లో పాల్గొనేవారు ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్, పుట్టిన తేదీ సర్టిఫికెట్, ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఒరిజినల్స్‌తో పాటు ఒక సెట్ జిరాక్స్, కిట్ బ్యాగు తప్పక తీసుకురావాలని తెలిపారు. 2008 సెప్టెంబర్ 1 నుంచి 2010 ఆగస్టు31 మధ్య జన్మించి ఉండాలి.

Similar News

News October 31, 2025

రేపు కడపకు రానున్న మాజీ ఉప రాష్ట్రపతి

image

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శనివారం కడపకు రానున్నారు. 2వ తేదీ కడప సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో జరిగే జానుమద్ది హనుమత్ శాస్త్రి శతజయంతి వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రేపు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి కడప చేరుకుని రాత్రికి బస చేసి 2న ఉదయం జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం తిరిగి ఆయన చెన్నైకు విమానంలో బయలుదేరి వెళ్తారని అధికారులు వెల్లడించారు.

News October 31, 2025

ఇంట్లో గోడ కూలి మహిళ మృతి.. మరొకరికి గాయాలు

image

ఇంట్లోని గోడ కూలి మహిళ మృతి చెందగా, మరో మహిళకు గాయాలైన ఘటన శుక్రవారం చింతకొమ్మదిన్నె మండలం కొప్పర్తి గ్రామం హరింద్రానగర్‌లో చోటుచేసుకుంది. కొట్లూరు శివమ్మ (52)ను గాయాలతో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో మహిళ అత్త కొట్లూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై చింతకొమ్మదిన్నె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News October 31, 2025

వచ్చేనెల 7న వైవీయూ అంతర కళాశాలల క్రీడల పోటీలు

image

నవంబరు 7న అంతర కళాశాలల క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు వైవీయూ వ్యాయామ విద్య, క్రీడా శాస్త్రాల బోర్డు కార్యదర్శి డా.రామసుబ్బారెడ్డి గురువారం తెలిపారు. పురుషులు, మహిళలకు రోలర్ స్కెటింగ్, రైఫిల్ షూటింగ్, యోగా, టేబుల్ టెన్నిస్ పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు వారి ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్లపై ప్రిన్సిపల్‌తో అటెస్టేషన్ చేయించుకోవాలన్నారు. వయసు 17-25 ఏళ్ల మధ్య ఉండాలని పేర్కొన్నారు.