News February 17, 2026

26న నెల్లూరుకు జగన్..!

image

YCP అధినేత జగన్ ఈనెల 26న నెల్లూరుకు రానున్నట్లు సమాచారం. VPR కన్వెన్షన్ హాల్లో జరగనున్న వివాహానికి ఆయన హాజరుకానున్నారు. రైల్వే కోడూరుకు చెందిన వైసీపీ ముఖ్య నేత కుమారుడి వివాహంలో జగన్ పాల్గొంటారని సమాచారం.

Similar News

News February 17, 2026

కొత్తగా ఆలోచించండి: నెల్లూరు కలెక్టర్

image

ఉద్యానవన శాఖ అధికారులతో నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యానవన శాఖ అధికారులు మండలాల్లో ఓ ప్రత్యేక థీంతో పనిచేసి ఆ మండలాలకు గుర్తింపు వచ్చేలా చూడాలన్నారు. వినూత్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని.. అలా చేస్తేనే నెల్లూరు జిల్లా వైపు అందరిని ఆకర్షించేలా చేయగలమని చెప్పారు. కలువాయి, సైదాపురం, దుత్తలూరులోని కోల్డ్ స్టోరేజ్‌లను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News February 17, 2026

26న నెల్లూరులో ఏం జరగనుంది..!

image

నెల్లూరు ఈనెల 26వ తేదీ స్పెషల్ డేగా మారనుంది. మాజీ సీఎంవ జగన్ ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనడానికి నెల్లూరుకు రానున్నారు. అదే రోజు నెల్లూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నిక జరగనుంది. గతంలో వైసీపీ నుంచి ఎన్నికైన స్రవంతి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మెజార్టీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. ఎన్నిక నామమాత్రమే కానుంది. అయినప్పటికీ అదే రోజు నెల్లూరుకు జగన్ రావడం ఆసక్తి రేపుతోంది.

News February 17, 2026

నెల్లూరు: వారిని.. అడిగినా పిలవడం లేదంట..!

image

నెల్లూరు జిల్లా రాజకీయాలు స్థానికతకే ప్రాధాన్యం ఉన్నట్టు స్పష్టమవుతోంది. దేశ రాజకీయాలనే శాసిస్తున్న BJPకి ఇక్కడ గౌరవం ఇవ్వడం లేదంట. తమను ఆహ్వానించాలని మంత్రుల పీఏలను BJP నేతలు కోరుతున్నా ఖాతరు చేయడం లేదంట. వక్ఫ్ బోర్డు స్థలంలో చేపడుతున్న ఇంటర్నేషనల్ స్కూల్ శంకుస్థాపనకు, 47వ డివిజన్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన కార్యక్రమాలకు పిలవలేదంట, కూటమిలో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని నేతలు వాపోతున్నారు.