News February 20, 2025
26 నుంచి అనకాపల్లిలో చెస్ టోర్నీ

అనకాపల్లిలో ఏప్రిల్ 26 నుంచి పది రోజులపాటు రతన్ టాటా స్మారక అంతర్జాతీయ ఓపెన్ ఫీడే రేటింగ్ చెస్ టోర్నీ జరగనుంది. ఈ మేరకు నిర్వాహకుడు మల్లికార్జున రావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ టోర్నీలో 500 మంది క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు. ఓపెన్ కేటగిరి టోర్నీ కావడంతో అన్ని వయసులవారు పాల్గొనవచ్చనన్నారు. విజేతలకు రూ.12 లక్షల వరకు నగదు బహుమతులు అందజేస్తామన్నారు.
Similar News
News November 9, 2025
శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలో భక్తులు ఉన్నారు. నిన్న వేంకటేశ్వరుడిని 80,560 మంది దర్శించుకున్నారు. 31,195 మంది తలనీలాలు సమర్పించగా, హుండీ ఆదాయం రూ.3.22 కోట్లు లభించింది. కాగా ఇవాళ సుప్రభాత సేవలో పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఏడుకొండలవాడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
News November 9, 2025
దారుణ హత్య.. వివాహేతర సంబంధమే కారణమా?

ఖమ్మం: ఏదులాపురం మున్సిపాలిటీ ముత్తగూడెం మరోసారి హత్యతో ఉలిక్కిపడింది. వారం కింద మహిళ హత్య ఘటన మరువకముందే, శనివారం బుర్రా శ్రీనివాసరావు(45) మృతదేహం సాగర్ కాల్వలో లభ్యం కావడం కలకలం సృష్టించింది. ఈ నెల 6న విధులు ముగించుకొని వస్తున్న శ్రీనివాసరావును, వరుసకు సోదరుడైన వ్యక్తి కిడ్నాప్ చేసి, హత్య చేసి ఉంటారని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఈ ఘాతుకం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.
News November 9, 2025
పోచంపల్లి: రెండు రోజుల వ్యవధిలో తండ్రీకొడుకుల మృతి

పోచంపల్లి మండలం జలాల్ పురంలో విషాదం జరిగింది. కొడుకు అంతక్రియలు నిర్వహించిన మూడో రోజే తండ్రి చనిపోయారు. గ్రామానికి చెందిన మహేందర్ గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతూ ఈనెల ఆరో తేదీన చనిపోయాడు. తండ్రి గడ్డం ప్రభాకర్ గతనెల 30న వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా కోతులు అడ్డుపడడంతో స్కూటీపై కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం తగలడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు.


