News April 10, 2025
26 మంది అమ్మాయిలను మోసం చేసిన రాజమండ్రి యువకుడు

MLA ఫొటోలను DPగా పెట్టి 26 మంది యువతులను మోసం చేసిన రాజమండ్రి యువకుడు హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మ్యాట్రీమోనీ సైట్ల ద్వారా అమ్మాయిలకు వల విసురుతూ నగదు దోచేశాడని అతడిమీద కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీసులు వంశీని 5రోజుల కస్టడీకి తీసుకున్నారు. యానాం MLA శ్రీనివాస్ ఫొటోలను వాడుకున్నట్లు చెప్పాడు. స్నేహితుల నుంచి తీసుకున్న 3సిమ్ కార్డులతో నేరాలకు పాల్పడ్డట్లు తేలింది.
Similar News
News April 17, 2025
నారాయణపేట: పదోన్నతులు బాధ్యతలు పెంచుతాయి: ఎస్పీ

పదోన్నతులు ఉద్యోగుల బాధ్యతలను పెంచుతాయని ఎస్పీ యోగేశ్ గౌతమ్ అన్నారు. కానిస్టేబుల్‌గా పని చేస్తూ హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందిన శివారెడ్డికి గురువారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో బ్యాడ్జి తొడిగించి శుభాకాంక్షలు తెలిపారు. పదోన్నతులు ఉత్సాహాన్ని ఇస్తాయని, ప్రజలకు ఉత్తమ సేవలు అందించి ఉన్నతాధికారులు మన్ననలు పొందాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్ఐ నరసింహ పాల్గొన్నారు.
News April 17, 2025
వైవీయూకు రూ.10 కోట్లు

కడప: అకడమిక్, రీసెర్చ్ ఎక్సలెన్స్ దిశగా దూసుకుపోతున్న వైవీయూకు మెగా రీసెర్చ్ ప్రాజెక్ట్ మంజూరైంది. ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్’ పార్టనర్‌షిప్స్ ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ పథకం కింద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌తో కలిసి రూ.10 కోట్లు నిధులు మంజూరయ్యాయి. అత్యున్నత స్థాయి పరిశోధనా సంస్థలతో కలసి వైవీయూ రీసెర్చ్ చేస్తుందని వీసీ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు తెలిపారు.
News April 17, 2025
రేపు హాల్ టికెట్లు విడుదల

AP: పలు ఉద్యోగ పరీక్షల హాల్‌టికెట్లను రేపు విడుదల చేయనున్నట్లు APPSC ప్రకటించింది. అభ్యర్థులు https://psc.ap.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఈ నెల 28న, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ జాబ్స్‌కు 28, 29న పరీక్షలు జరుగుతాయి. ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు 28న పేపర్-1, 30న పేపర్-2, పేపర్-3 ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.