News April 11, 2025

26/11 అటాక్‌లో హైదరాబాద్ ప్రస్తావన

image

ముంబై ఉగ్రదాడి నిందితుడు రాణాను ఎట్టకేలకు ఢిల్లీకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో HYDకు చెందిన ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. కాగా.. అజ్మల్ కసబ్ దగ్గర నాగోల్ చిరునామా, అరుణోదయ కాలేజీ పేరు ఉన్న బోగస్ ఐడీలు బయటపడ్డాయి. ఆ కార్డుల్లో నగర చిరునామాలు ఉండటంతో ముంబై పోలీసులు HYD చేరుకుని దర్యాప్తు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ‘HYD’ అనే ఉగ్రవాదుల వ్యాఖ్యలు కలకలం రేపాయి. నిపుణుల భాషా విశ్లేషణతో వారు పాక్ అని తేలిపోయింది.

Similar News

News April 19, 2026

వేసవి తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదివారం సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం, విపత్తుల నిర్వహణ సంస్థ మార్గదర్శకాల ప్రకారం ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని కోరారు. వడదెబ్బ నివారణకు కాటన్ దుస్తులు ధరించాలని, దాహం లేకపోయినా తరచుగా మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ వంటి ద్రవాలు తీసుకోవాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదన్నారు.

News April 19, 2026

రైతులకు ‘ఫార్మర్ ఐడీ’ తప్పనిసరి: కలెక్టర్ అంకిత్

image

భద్రాద్రి జిల్లాలోని ప్రతి రైతు ‘ఫార్మర్ రిజిస్ట్రీ’లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. ఆదివారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. పీఎం కిసాన్, రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలు అందాలంటే 14 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య (ఫార్మర్ ఐడీ) ఉండాలన్నారు. రైతులు వెంటనే ఏఈవోలను లేదా మీసేవ కేంద్రాలను సంప్రదించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు.

News April 19, 2026

భద్రాద్రి: రేపు కలెక్టరేట్‌లో ప్రజావాణి

image

కలెక్టరేట్‌లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజలు తమ తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని సూచించారు. ఉదయం 10:30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. సంబంధిత శాఖాధికారులు ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను స్వీకరిస్తామని పేర్కొన్నారు.