News December 27, 2024

26/11 మాస్టర్ మైండ్ హఫీజ్ మృతి

image

ముంబై ఉగ్రదాడి(26/11) వెనుక మాస్టర్ మైండ్‌, లష్కర్-ఎ-తొయిబా ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రహ్మాన్ మక్కీ గుండెపోటుతో మరణించాడు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అతడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈక్రమంలోనే ఇవాళ ఉదయం హార్ట్‌ఎటాక్‌తో చనిపోయాడు. 2023లో UNO అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. భారత్‌పై విషం చిమ్మే హఫీజ్ రామ్‌పుర, ఎర్రకోట, ముంబై దాడుల్లో కీలకపాత్ర పోషించారు.

Similar News

News February 21, 2026

తొలి తెలుగు శిలా శాసనం.. చూశారా?

image

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా కడపలోని(AP) సి.పి. బ్రౌన్ గ్రంథాలయంలో ప్రదర్శించిన తొలి తెలుగు శిలా శాసనం నమూనా స్థూపం ఫొటో నెట్టింట వైరలవుతోంది. క్రీ.శ.575 కాలానికి చెందిన ఈ రేనాటి చోళుల శాసనం.. తెలుగు భాష ప్రాచీనతకు సజీవ సాక్ష్యం. మాతృభాషపై మమకారంతో పలువురు ఈ ఫొటోను షేర్ చేస్తూ మన భాషా వారసత్వాన్ని ఘనంగా చాటుతున్నారు. మన భాషకు ‘ప్రాచీన హోదా’ రావడంలో ఇటువంటి శాసనాలే కీలక పాత్ర పోషించాయి.

News February 21, 2026

260 పోస్టులు.. అప్లై చేశారా?

image

<>ఇండియన్ <<>>నేవీలో 260 ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఫిబ్రవరి 24 ఆఖరు తేదీ. షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి BE/BTech, MBA, BSc/B.Com/BSc(IT), MSc/MA, ME, MTech ఉత్తీర్ణతతో పాటు శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అకడమిక్ మెరిట్, SSB ఇంటర్వ్యూ, DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in

News February 21, 2026

ఎందుకలా?!: గాలి మనకు కనిపించదు..

image

ఏదైనా వస్తువు మనకు కనిపిస్తుందంటే దానిపై కాంతి పడి పరావర్తనం(రిఫ్లెక్షన్) చెందిందని అర్థం. అటు ఏ పదార్థం/వస్తువు ఏర్పడాలన్నా అణువుల కలయిక అవసరం. అయితే గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్ వంటి గ్యాసెస్ అణువులున్నా కనిపించకపోవడానికి కారణం వాటి నిర్మాణం. అవి చాలా సూక్ష్మంగా, పారదర్శకంగా ఉంటాయి. దీంతో వాటిపై కాంతి పడినా రిఫ్లెక్ట్ చేయలేవు. ఫలితంగా గాలిని చూడలేం. ప్రతిరోజూ 2pmకు ఇలా ఓ కొత్త విషయం ఎందుకలా?!లో.