News July 31, 2024

26.5 అడుగులకు చేరిన పాకాల నీటి మట్టం

image

వరంగల్ జిల్లా ఖానాపురం మండల పరిధిలోని పాకాల సరస్సు నీటిమట్టం బుధవారం ఉదయం నాటికి 26.5 అడుగులకు చేరుకుంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు పాకాల సరస్సులోకి వచ్చి చేరుతోంది. కాగా పాకాల పూర్తి స్థాయి నీటిమట్టం 30.3 అడుగులుగా ఉంది. ఇలాగే వరద నీరు సరస్సులోకి వస్తే కొన్ని రోజుల్లోనే అలుగు పడుతుందని రైతులు, ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 19, 2025

వరంగల్ జిల్లాలో యూరియా నో స్టాక్..!

image

రైతులు యూరియా కొనుగోలు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్‌ను తీసుకొని వచ్చింది. తమకు కావలసిన యూరియా బస్తాలను యాప్ ద్వారా బుక్ చేసుకుంటే రైతులకు దగ్గరలో ఉన్న డీలర్ వద్ద నుంచి బస్తాలు తీసుకెళ్లవచ్చని అధికారులు సూచించారు. దీంతో యాప్‌లో యూరియా బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్న రైతులకు నిరాశే ఎదురవుతుంది. వరంగల్ జిల్లాలో యూరియా స్టాక్ లేదని యాప్‌లో చూపిస్తోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

News December 19, 2025

వరంగల్: యూరియా యాప్ విధానంపై రైతుల ఆవేదన

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి యూరియా కోసం మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సాంకేతిక పరిజ్ఞానం తెలియని, స్మార్ట్ ఫోన్ లేని వారు ఎక్కువగా ఉండటంతో ఈ విధానం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాప్‌కు ప్రత్యామ్నాయంగా ఆఫ్‌లైన్ విధానాన్ని కూడా కొనసాగించాలని వారు కోరుతున్నారు.

News December 19, 2025

వరంగల్ జిల్లాలో సాగు వివరాలు..!

image

జిల్లాలో యాసంగి సీజన్ ప్రారంభమైంది. 2025-26 యాసంగి పంటల సాగు, విత్తనాలు, ఎరువుల లభ్యతపై కలెక్టర్
సత్య శారద సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం మొక్కజొన్న 26,510 ఎకరాలు, కూరగాయలు తదితర ఉద్యాన పంటలు 6,877 ఎకరాల్లో సాగవుతున్నాయి. వరి పంట 1,15,200 ఎకరాల సాగు అంచనాతో 23,040 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. మొక్కజొన్న 1,08,500 ఎకరాల అంచనాకు 8,680 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి.