News October 6, 2024
ఇజ్రాయెల్ దాడిలో 26మంది మృతి: హమాస్

గాజాపై ఇజ్రాయెల్ చేసిన తాజా దాడిలో ఓ మసీదులో 26మంది ప్రాణాలు కోల్పోయారని హమాస్ తెలిపింది. డెయిర్ అల్-బలాలో ఉన్న ఆ మసీదులో శరణార్థులు తల దాచుకున్నారని పేర్కొంది. అనేకమంది తీవ్రగాయాలపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేసింది. అటు ఇజ్రాయెల్ ఆ ప్రకటనను ఖండించింది. హమాస్ ఉగ్రవాదులు తలదాచుకున్న ప్రాంతాన్ని తాము అత్యంత కచ్చితత్వంగా గుర్తించి ధ్వంసం చేశామని, అందులో హమాస్ కమాండ్ సెంటర్ ఉందని పేర్కొంది.
Similar News
News November 10, 2025
స్పీకర్‌పై BRS కోర్టు ధిక్కార పిటిషన్

TG: ఫిరాయింపు MLAలపై నిర్దేశించిన 3 నెలల గడువులోగా చర్యలు తీసుకోలేదని TG స్పీకర్‌పై BRS పార్టీ న్యాయవాది మోహిత్‌రావు SCలో ధిక్కార పిటిషన్ వేశారు. అత్యవసరంగా దీనిపై విచారించాలని కోరారు. ఉద్దేశపూర్వకంగా స్పీకర్ ఆలస్యం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈనెల 23న ప్రస్తుత CJI రిటైర్ అవుతారని, కొత్త CJI వస్తే మొదట్నుంచి విచారించాల్సి ఉంటుందని వివరించారు. వచ్చే సోమవారం విచారిస్తామని జస్టిస్ గవాయ్ చెప్పారు.
News November 10, 2025
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? రైల్వే టికెట్ బుకింగ్స్ మొదలు!

వచ్చే సంక్రాంతికి (జనవరి 2026) ఊళ్లకు వెళ్లాలనుకునేవారికి అలర్ట్. భారతీయ రైల్వే టికెట్ బుకింగ్స్ 60 రోజుల ముందుగానే ప్రారంభమవుతాయి. ఇవాళ జనవరి 9వ తేదీవి, రేపు JAN 10, ఎల్లుండి JAN 11, గురువారం రోజున జనవరి 12వ తేదీకి సంబంధించిన టికెట్లు రిలీజ్ కానున్నాయి. సొంతూళ్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండి IRCTC అధికారిక వెబ్సైట్ లేదా యాప్ ద్వారా వెంటనే బుక్ చేసుకోవచ్చు. SHARE IT
News November 10, 2025
సేఫ్ పాస్వర్డ్ ఇలా సెట్ చేసుకోండి

సైబర్ నేరాలు, హ్యాకింగ్స్ విపరీతంగా పెరిగిపోతున్నందున <<18240768>>పాస్‌వర్డ్‌లపై<<>> ప్రత్యేక శ్రద్ద పెట్టాలని సూచిస్తున్నారు టెక్ నిపుణులు. పాస్‌వర్డ్‌ను ఎలా సెట్ చేసుకుంటే సేఫ్ అనే విషయాలను చెబుతున్నారు. అప్పర్‌కేస్, లోయర్‌కేస్ లెటర్స్, నంబర్స్, సింబల్స్ కాంబోలో పాస్వర్డ్ సెట్ చేసుకోవాలని అంటున్నారు. ఫోన్ నంబర్లు, బర్త్‌డేలు, ఫ్యామిలీ మెంబర్ల పేర్లను పాస్‌వర్డ్‌లుగా పెట్టుకోకూడదని హెచ్చరిస్తున్నారు.


