News July 28, 2024
దేశంలో మొత్తం కేసుల్లో 26శాతం ఆ రెండు క్యాన్సర్లే !

భారత్లో క్యాన్సర్ కేసుల్లో 26శాతం తల, గొంతు సంబంధించినవే ఉన్నాయని క్యాన్సర్ ముక్త్ భారత్ ఫౌండేషన్ అధ్యయనంలో వెల్లడైంది. ఈ కేసులు పెరుగుతున్నాయని ఓ నివేదికలో సంస్థ వెల్లడించింది. 1869మంది క్యాన్సర్ బాధితులపై ఈ సర్వే నిర్వహించినట్లు తెలిపింది. ‘పొగాకు వినియోగం, హెచ్పీవీ వైరస్ ఈ రెండు క్యాన్సర్ల పెరుగుదలకు కారణం. నోటి క్యాన్సర్ బాధితుల్లో 90శాతం మంది పొగాకుకు అలవాటుపడినవారే’ అని వివరించింది.
Similar News
News September 16, 2025
నెల్లూరు నగరపాలక సంస్థలో ఇద్దరిపై సస్పెన్షన్ వేటు

నెల్లూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఇన్ఛార్జ్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న వెంకటేశ్, వార్డ్ ప్లానింగ్ సెక్రటరీ శివకుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు కమిషనర్ నందన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని కనకమహాల్ సెంటర్లో మూడంతస్తుల భారీ భవంతి నిర్మిస్తున్నారు. దానికి ఎలాంటి అనుమతులు లేవు. వ్యవహారాన్ని మేయర్ స్రవంతి ఇటీవల బయటపెట్టడంతో వారిపై సస్పెన్షన్ వేటు పడింది.
News September 16, 2025
16 వేల మంది విదేశీయులపై చర్యలకు కేంద్రం సిద్ధం

డ్రగ్ ట్రాఫికింగ్ కేసుల్లో పట్టుబడిన 16 వేల మంది విదేశీయులపై చర్యలకు కేంద్రం సిద్ధమైంది. వారిని స్వదేశాలకు పంపనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) సమర్పించిన నివేదిక ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటికే రాష్ట్రాల వారీగా డ్రగ్ ట్రాఫికర్స్ జాబితా సిద్ధం చేసి కేంద్ర హోం శాఖకు పంపినట్లు వెల్లడించాయి.
News September 16, 2025
యువరాజ్, ఉతప్ప, సోనూసూద్లకు ED సమన్లు

భారత మాజీ క్రికెటర్లు యువరాజ్, ఉతప్ప, బాలీవుడ్ నటుడు సోనూసూద్లకు ED సమన్లు జారీ చేసింది. ఇల్లీగల్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్(1xBet)కు సంబంధించి మనీ ల్యాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ క్రికెటర్లు రైనా, ధవన్, మాజీ నటి మిమీ చక్రవర్తిలను ED విచారించింది. కాగా 1xBet యాప్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న నటి ఊర్వశీ రౌతేలాకు గతంలోనే సమన్లు జారీ చేసింది.