News November 19, 2024
శబరిమలకు 26 స్పెషల్ రైళ్లు

భక్తుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే శబరిమలకు 26 స్పెషల్ రైళ్లను నడపనుంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల మధ్య ఇవి ప్రయాణించనున్నాయి. నవంబర్ 18, 20, 22, 24, 25, 27, 29 తేదీల్లో.. డిసెంబర్ 1, 2, 4, 6, 8, 9, 11, 13, 15, 16, 18, 20, 22, 23, 25, 27, 29, 30.. జనవరి 01 తేదీల్లో అందుబాటులో ఉండనున్నాయి. భక్తులు స్పెషల్ రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.
Similar News
News January 6, 2026
తత్కాల్ టికెట్ బుకింగ్ టిప్.. ఈ ఫీచర్తో పని ఈజీ!

IRCTCలో తత్కాల్ టికెట్ త్వరగా బుక్ అవ్వాలంటే Master List ఫీచర్ వాడొచ్చు. ‘My Profile’లో ప్రయాణికుల పేర్లు, వయసు, ఆధార్ వివరాలను ముందే సేవ్ చేసుకోవచ్చు. దీనివల్ల బుకింగ్ టైమ్లో మళ్లీ టైప్ చేసే పని ఉండదు. కేవలం ఒక్క క్లిక్తో ప్యాసింజర్ డీటెయిల్స్ యాడ్ అవుతాయి. టైమ్ ఆదా అవ్వడమే కాకుండా తత్కాల్ సీటు దొరికే ఛాన్స్ పెరుగుతుంది. గరిష్ఠంగా 12 మంది వివరాలను ఇందులో స్టోర్ చేసుకోవచ్చు.
News January 6, 2026
బంగారు పేపర్లతో భగవద్గీత

కర్ణాటకలోని ప్రసిద్ధ ఉడుపి శ్రీకృష్ణ మఠానికి అపురూపమైన కానుక అందింది. ఢిల్లీకి చెందిన ఓ భక్తుడు రూ.2 కోట్ల విలువైన బంగారు పేపర్లతో రూపొందించిన స్వర్ణ భగవద్గీతను సమర్పించారు. 18 అధ్యాయాలు, 700 శ్లోకాలతో రూపొందిన ఈ గ్రంథాన్ని విశ్వగీతా పర్యాయ ముగింపు రోజున మఠాధిపతి విద్యాధీశతీర్థ స్వామికి అందజేయనున్నారు. ఈ నెల 8న బంగారు రథంలో ఊరేగింపుగా తీసుకొచ్చి మఠానికి బహూకరించనున్నారు.
News January 6, 2026
AIలో 83% విద్యార్థులకు ఉద్యోగాలు

TG: IIT హైదరాబాద్లో 62.42% మందికి ఉద్యోగాలు వచ్చినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ BS మూర్తి తెలిపారు. ఈ సారి మొత్తం 487 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 304 మందికి ఉద్యోగాలు లభించాయని పేర్కొన్నారు. సగటు వార్షిక ప్యాకేజీ రూ.30 లక్షలుగా ఉన్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా AI విభాగంలో 83.3% విద్యార్థులకు ప్లేస్మెంట్స్ రావడం విశేషం. CSE విద్యార్థి ఎడ్వర్డ్ <<18734504>>వర్గీస్<<>>కు రూ.2.5 కోట్ల ప్యాకేజీతో జాబ్ వచ్చింది.


