News February 10, 2025

26 ఏళ్ల క్రితం.. ఢిల్లీకి 5 ఏళ్లలో ముగ్గురు సీఎంలు!

image

ఢిల్లీలో 26 ఏళ్ల తర్వాత బీజేపీ సర్కార్ ఏర్పాటు కాబోతోంది. అయితే చివరిసారిగా (1993-1998) ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లలో ముగ్గురు సీఎంలు పాలించారు. తొలుత మదన్‌లాల్ ఖురానా సీఎం అయ్యారు. అవినీతి ఆరోపణలు రావడంతో 27 నెలలకే రాజీనామా చేశారు. ఆ తర్వాత సాహిబ్ సింగ్ వర్మ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఉల్లి ధరలపై విమర్శలతో 31 నెలల్లో రిజైన్ చేశారు. ఆ తర్వాత సుష్మా స్వరాజ్ 52 రోజులపాటు సీఎంగా ఉన్నారు.

Similar News

News September 16, 2025

వనపర్తి: నిరుద్యోగులకు జాబ్ మేళా

image

నిరుద్యోగ యువతకు హైదరాబాద్‌లోని వివిధ కంపెనీలలో శిక్షణ, ఉపాధి కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర సహకారంతో సెప్టెంబర్ 18న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి వెంకటేశ్వర్ల రాజు తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలన్నారు. SSC, ITI, DEGREE అర్హతలన్నారు.

News September 16, 2025

వివేకా హత్య కేసులో దర్యాప్తుకు సిద్ధం: సీబీఐ

image

AP: వైఎస్ వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. కోర్టు తగిన ఆదేశాలిస్తే ముందుకు వెళ్తామని పేర్కొంది. పిటిషనర్ ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాలని కోరుతున్నారని చెప్పింది. ఈ మేరకు సీబీఐ అభిప్రాయాన్ని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తెలిపారు.

News September 16, 2025

ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

image

TG: రాబోయే 3 గంటల్లో కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, హనుమకొండ, భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, కరీంనగర్, మేడ్చల్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, భువనగిరిలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.