News April 10, 2024

264 మంది వాలంటీర్ల రాజీనామాలకు ఆమోదం: కలెక్టర్ సృజన

image

జిల్లా వ్యాప్తంగా 11 మండలాలకు చెందిన 264 మంది వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించినట్లు కలెక్టర్ డాక్టర్ సృజన బుధవారం తెలిపారు. అత్యధికంగా క్రిష్ణగిరి మండలంలో 59 మంది, మద్దికేర మండలంలో 48, వెల్దుర్తిలో 37, పత్తికొండలో 32, తుగ్గలిలో 23, ఆదోనిలో 5, అత్యల్పంగా ఆస్పరి, కర్నూలు మండలాలకు చెందిన వాలంటీర్లు రాజీనామా చేశారన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. 

Similar News

News September 30, 2024

కర్నూలు జిల్లాలో టమాటా ధర అదరహో

image

టమాటా రైతులకు కాసుల పంట పండుతోంది. కర్నూలు జిల్లాలో కిలో రూ.70 వరకు పలుకుతోంది. రైతుబజార్లలో కిలో రూ.30 నుంచి ₹44గా ఉంది. ప్రస్తుతం జిల్లాలో రోజుకు 600 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. 25 కిలోల బాక్స్ ₹1400 వరకు పలుకుతోంది. పత్తికొండ, డోన్, ప్యాపిలి, ఆస్పరి, దేవనకొండ, క్రిష్ణగిరి, హొళగుంద, మద్దికెర, పెద్దకడబూరు, కల్లూరు తదితర మండలాల్లో ఈ పంటను సాగు చేశారు. జిల్లాలో సుమారు 10 వేల ఎకరాల్లో సాగులో ఉంది.

News September 30, 2024

రేపు పత్తికొండకు CM.. ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామానికి రేపు సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి.రంజిత్ బాషా, ఎస్పీ జి.బిందు మాధవ్ అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్‌లో భాగంగా ఆదివారం పుచ్చకాయలమడలో హెలిప్యాడ్, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్, ఎస్పీ ఆదేశించారు.

News September 30, 2024

నంద్యాలలో నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

image

నంద్యాలలోని కలెక్టరేట్ సెంటినరీ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు. ఉదయం 9-30 గంటలకు జిల్లాధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని చెప్పారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.