News May 27, 2024
266 మందిపై కేసులు నమోదు: బాపట్ల SP
కౌంటింగ్ నేపథ్యంలో బాపట్ల జిల్లాలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ సామాన్య ప్రజలకు, మహిళలకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఒక్కరోజే 266 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిపై కేసులు నమోదు చేశామన్నారు.
Similar News
News November 30, 2024
చీమకుర్తిలో కిడ్నాప్
ప్రకాశం జిల్లాలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు మండలం మడగడ గ్రామానికి చెందిన దినేశ్(16)ని కిడ్నాప్ చేశారు. ఈక్రమంలో అతడిని చీమకుర్తి గాంధీనగర్‌లో ఉంటున్న అరవింద్ అనే వ్యక్తి ఇంటికి కిడ్నాపర్లు తీసుకు వచ్చారు. దినేశ్ వారి నుంచి తప్పించుకుని చీమకుర్తి పోలీసులను ఆశ్రయించాడు. CI సుబ్బారావు కిడ్నాపర్లను వెంబడించి ఒకరిని పట్టుకోగా మరో ఇద్దరు పరారయ్యారు.
News November 28, 2024
రేపు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం రేపు ఉదయానికి తుఫానుగా బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం ఉదయం TN-పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో 4రోజుల పాటు వర్షాలు కురుస్తాయంది. రేపు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది.
News November 28, 2024
పెట్లూరు సచివాలయాన్ని తనిఖీ చేసిన మంత్రి స్వామి
కొండపి మండలం పెట్లూరులో గ్రామ సచివాలయాన్ని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా రికార్డుల పరిశీలించి, నిర్వహణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సచివాలయ సిబ్బందిని రేషనలైజేషన్ చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. సేవలన్నీ ప్రజలకు సకాలంలో అందించాలని ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు.