News September 15, 2025

268 అర్జీలు త్వరితగతిన పరిష్కరించండి: JC

image

ఏలూరులోని గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన అర్జిదారుల నుంచి JC ధాత్రిరెడ్డి అర్జీలు స్వీకరించారు. 268 ఫిర్యాదులను స్వీకరించిన ఆమె బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. ఫిర్యాదులు తమ పరిధిలోనివి కానప్పుడు వెంటనే సంబంధిత శాఖలకు ఎండార్స్ చేసి పంపాలని ఆదేశించారు.

Similar News

News September 15, 2025

NRPT: ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ సమీక్ష

image

ఎలక్టర్ మ్యాపింగ్ టేబుల్‌ను పకడ్బందీగా తయారు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తహశీల్దార్లకు సూచించారు. త్వరలో భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఎస్.ఐ.ఆర్ షెడ్యూల్ విడుదల చేయనున్న నేపథ్యంలో బీఎల్వోలు అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. కొత్త పోలింగ్ కేంద్రాల ప్రతిపాదన ఉన్న చోట వారికి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.

News September 15, 2025

సూపర్-4కు దూసుకెళ్లిన టీమిండియా

image

ఆసియా కప్‌లో టీమిండియా సూపర్-4కు దూసుకెళ్లింది. తాజాగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో UAE ఘన విజయం సాధించడంతో భారత్‌‌కు లైన్ క్లియర్ అయింది. టీమిండియా ఇప్పటికే UAE, పాక్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. మెరుగైన నెట్ రన్‌రేట్(4.793) కారణంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్-4కు అర్హత సాధించింది. రెండో బెర్త్ కోసం పాక్, UAE పోటీ పడనున్నాయి.

News September 15, 2025

సిరిసిల్లలో ఘనంగా ఇంజినీర్స్ డే

image

భారతరత్న, సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంజినీర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, నీటిపారుదల, గృహ నిర్మాణ శాఖల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంజినీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు.