News April 25, 2025
26న కామారెడ్డిలో జాబ్ మేళా

ఈ నెల 26న కామారెడ్డి జిల్లా కేంద్రంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మల్లయ్య తెలిపారు. పలు ప్రైవేట్ కంపెనీల ఆధ్వర్యంలో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్ మేళా కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సర్టిఫికెట్లతో ఉదయం 11 గంటలకు కార్యాలయానికి రావాలని ఆయన సూచించారు.
Similar News
News April 25, 2025
KNR: ప్రతి బుధవారం వరంగల్ మార్కెట్ బంద్!

ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వరంగల్ మార్కెట్‌కు మిర్చి పంటను అమ్మకానికి తీసుకెళ్లే రైతులకు ముఖ్య గమనిక. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున గుమస్తా సంఘం కోరిక మేరకు ఈ నెల 30 నుంచి జూన్ 11 వరకు వచ్చే ప్రతి బుధవారం మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటించినట్లు వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేర్కొంది. మార్కెట్ బీట్ సమయం కూడా ఉదయం 07:05 నిమిషాలకు ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. కావున రైతులు గమనించగలరు.
News April 25, 2025
పాలకొల్లు: సీఎం, డిప్యూటీ సీఎంకి హరిరామజోగయ్య లేఖ

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపకుడు హరిరామ జోగయ్య లేఖ రాశారు. డీఎస్సీ ఉద్యోగ నియామకాల్లో కాపులకు EWS కోటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 103 రాజ్యాంగ సవరణ ప్రకారం విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. కాపుల అభ్యున్నతికి తోడ్పడవల్సిందిగా ఆ వర్గం తరఫున కోరుతున్నానని పేర్కొన్నారు.
News April 25, 2025
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లే ఉంది: డానిష్ కనేరియా

పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా స్పందించారు. ‘టెర్రరిస్టులను స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చడం దారుణం. ఆయన వ్యాఖ్యలు నిజంగానే పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నట్లుగా ఉన్నాయి’ అని ఎక్స్‌లో మండిపడ్డారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపైనా డానిష్ దాయాది దేశాన్ని విమర్శించారు. అతడు ప్రస్తుతం USలో నివాసముంటున్నారు.