News February 19, 2025

27న కాకినాడ జిల్లాలో సెలవు

image

ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 27న జరగనుంది. పలువురు అధికారులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం ఓటింగ్‌లో పాల్గొననున్నారు. ఈక్రమంలో 27వ తేదీన స్పెషల్ లీవ్ మంజూరైందని ఎన్నికల అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా సెలవును అడ్జస్ట్ చేసుకోవాలని ఆమె సూచించారు.

Similar News

News December 23, 2025

KNR: షోకాజ్ నోటీసులపై అదనపు కలెక్టర్‌కు ‘టీటీయూ’ వినతి

image

పంచాయతీ ఎన్నికల విధులకు హాజరుకాని ఉపాధ్యాయులకు జారీ చేసిన షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని కోరుతూ తెలంగాణ టీచర్స్ యూనియన్ (TTU) నాయకులు సోమవారం అదనపు కలెక్టర్, డీఈవో డాక్టర్ అశ్వినీ తనజీ వాంక్డేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ.. అనారోగ్యం లేదా ఇతర సహేతుకమైన (జెన్యూన్) కారణాలతో విధులకు రాలేని వారికి తప్పనిసరిగా మినహాయింపు ఇస్తామని హామీ ఇచ్చారు.

News December 23, 2025

జమ్మికుంట: క్వింటా పత్తి ధర రూ.7,400

image

మూడు రోజుల విరామం అనంతరం సోమవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌ ఈరోజు ప్రారంభమైంది. కాగా, పత్తి ధర స్వల్పంగా తగ్గింది. మార్కెట్‌కు 43 వాహనాల్లో 278 క్వింటాళ్ల పత్తి విక్రయానికి రాగా, గరిష్ఠంగా క్వింటాకు రూ.7,400, కనిష్ఠంగా రూ.7,000 ధర పలికింది. గత వారం కంటే ధర రూ.50 తగినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా తెలిపారు.

News December 23, 2025

నల్గొండ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

చింతపల్లి: ర్యాలీపై దాడి.. పలువురికి గాయాలు
నల్గొండ: ప్రజావాణికి 53 దరఖాస్తులు
మునుగోడులో జీవో ప్రతులు దహనం
నల్గొండలో భారీ నిరసన
మిర్యాలగూడ: రైల్వే ట్రాక్ వద్ద మృతదేహం
కొండమల్లేపల్లి: సర్పంచ్ ఇంటిపై దాడి
చండూరు: కుమారుడి ప్రమాణ స్వీకారం రోజే తండ్రి మృతి
అమెరికాలో నల్గొండ యువకుడి మృతి
నల్గొండ: మరో పథకానికి మంగళం