News March 25, 2024

27న నెల్లూరుకు చంద్రబాబు నాయుడు

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్చి 27న నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్నారు. ప్రజాగళం పేరుతో ఆయన పర్యటన సాగనుంది. ఈ మేరకు సమాచారం రావడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు సన్నాహాల్లో నిమగ్నమయ్యారు.

Similar News

News November 10, 2024

రెండో రోజు ఘనంగా ప్రారంభమైన కార్తీక మాస లక్ష దీపోత్సవం

image

నెల్లూరులోని విఆర్సి గ్రౌండ్స్ లో జరుగుతున్న కార్తీక మాస లక్ష దీపోత్సవం రెండో రోజు ఘనంగా నిర్వహించారు. రుద్ర హోమం, ఆంజనేయ స్వామికి ఆకు పూజ కార్యక్రమంలో వేమిరెడ్డి దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య జరిగిన విశేష రుద్ర హోమం కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

News November 10, 2024

కావలికి శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు రాక

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు ఆదివారం కావలి పట్టణానికి విచ్చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో కలిసి కావలి పట్టణంలోని మినీ స్టేడియాన్ని సందర్శిస్తారు. తదుపరి స్థానిక ప్రజల నుంచి సూచనలు స్వీకరిస్తారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది శనివారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు.

News November 9, 2024

సూళ్లూరుపేట: రోడ్డు ప్రమాదంలో నేపాల్ వాసి మృతి

image

తడ మండలం పూడి గ్రామం వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నేపాల్ నుంచి వచ్చి పూడి గ్రామంలో కూలి పనులు చేసుకుంటున్న దమ్మరే పరియర్ అనే వ్యక్తి రోడ్డు క్రాస్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టింది. క్షతగాత్రునికి తీవ్ర గాయాలు కాగా మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మరణించాడు. పరియర్ భార్య సుశీల పరియర్ ఫిర్యాదుతో తడ పోలీసులు కేసు నమోదు చేశారు.