News March 22, 2024
27న పలమనేరులో చంద్రబాబు ప్రచారం

మాజీ సీఎం చంద్రబాబు
ఈనెల 27 నుంచి 31 వరకు రోడ్ షోలు నిర్వహించనున్నారు. సంబంధత పర్యటన వివరాలను టీడీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. ఈనెల 27న పలమనేరు, నగరి, మదనపల్లెలో ఎన్నికల ప్రచారం చేస్తారు. 28న అనంతపురం, శ్రీసత్యసాయి, 29న కర్నూలు, నంద్యాల, 30న కడప, తిరుపతిలో, 31న నెల్లూరు, ఒంగోలులో ప్రచారం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News September 16, 2025
చిత్తూరు: 19న మెగా జాబ్ మేళా

చిత్తూరు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 19వ తేదీన మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి పద్మజ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం మూడు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, ఎంబీఏ, ఎంకాం, పీజీ, డీ, బీ ఫార్మసీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News September 15, 2025
రొంపిచర్లలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

బైకులు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన రొంపిచర్ల మండలంలో జరిగింది. అన్నమయ్య జిల్లా పీలేరుకు చెందిన విజయ్ కుమార్ అతని భార్య రాజేశ్వరితో కలిసి బైక్పై తిరుపతికి వెళుతుండగా రొంపిచర్లకు చెందిన మహమ్మద్ గౌస్ పీర్ బైక్పై వస్తూ ఆదర్శ పాఠశాల సమీపంలో ఢీకొన్నారు. ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. మహమ్మద్ గౌస్ పీర్ను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News September 15, 2025
కాణిపాకంలో రేపు లడ్డూ వేలంపాట

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి మహాప్రసాదం లడ్డూకు బహిరంగంగా వేలం నిర్వహిస్తున్నట్లు ఈవో పెంచల కిశోర్ తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం తెప్పోత్సవాలను నిర్వహించనున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు రేపు 21వ రోజు కావడంతో 21 కేజీల లడ్డూను తెప్పోత్సవం ముగిసిన తర్వాత కోనేరు ఎదుట వేలం వేయనున్నారు.