News February 19, 2025
27న ప.గో జిల్లాలో సెలవు

ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 27న జరగనుంది. పలువురు అధికారులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం ఓటింగ్‌లో పాల్గొననున్నారు. ఈక్రమంలో 27వ తేదీన స్పెషల్ లీవ్ మంజూరైందని ఎన్నికల అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా సెలవును అడ్జస్ట్ చేసుకోవాలని ఆమె సూచించారు.
Similar News
News March 19, 2025
ప.గో : వారికి పింఛను కట్

ప.గో జిల్లాలో ఫించనుదారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 20 లోగా జీవన ప్రమాణాల పత్రం సంబంధిత అధికారులకు అందించాలని, లేకుంటే మార్చి నెలకు సంబంధించిన పింఛను సొమ్మును నిలిపివేస్తామని తెలిపారు. జిల్లాలో మొత్తం 14, 739 మంది ఉండగా.. గత నెల చివరి వరకు 14, 335 మంది పత్రాలను అందించినట్లు తెలిపారు. మిగిలిన వారికి పింఛను ఆపేసే అవకాశముందన్నారు.
News March 19, 2025
కొల్లేరు సరిహద్దులు గుర్తింపు.. వారందరిలో ఆందోళన

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొల్లేరు సరిహద్దులను గుర్తించే ప్రక్రియను అధికారులు ముమ్మరంగా చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతాల్లో ఉంటున్న వారంతా ఆందోళనకు గురవుతున్నారు. ప్రజాప్రతినిధులను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. తమ జీవనోపాధికి ఆటంకం లేకుండా చూడాలని వేడుకుంటున్నారు. ఈ సర్వే ఇంకా పూర్తి కావాల్సి ఉంది. సర్వే పూర్తయి నివేదిక పరిశీలించిన తర్వాత సుప్రీం ఏం చేయబోతుందన్నదనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
News March 19, 2025
ప.గో : అమ్మకు చీర కొనడానికి దొంగతనం.. చివరికి

ఏలూరు జిల్లా చాట్రాయికి చెందిన సురేందర్ తెలంగాణలో కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రాంత పోలీసులు మంగళవారం సురేందర్ నేరాలను వివరించారు. 90 కేసుల్లో నిందితుడిగా ఉన్న అతను పశ్చిమ గోదావరి జిల్లాలోనూ దొంగతనం చేసినట్లు వెల్లడించారు. మొదటిసారి అమ్మకు చీర కొనడానికి రూ.300 దొంగతనం చేశాడన్నారు. అతడి వద్ద రూ. 45 లక్షల సొత్తు రికవరీ చేసి, రిమాండ్ కు తరలించామన్నారు.