News December 23, 2024
27లోపు అభ్యంతరాలు చెప్పొచ్చు: గుంటూరు DEO
గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేయనున్న స్కూల్ కాంప్లెక్స్ సముదాయాల వివరాల ఉత్తర్వులు, జాబితాను ఉప, మండల విద్యాశాఖ అధికారులు తమ కార్యాలయాల్లో ప్రదర్శించాలని గుంటూరు డీఈవో సి.వి రేణుక సూచించారు. దీనిపై అభ్యంతరాలను 27వ తేదీ లోపు జిల్లా, మండల విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో అందించవచ్చని చెప్పారు. https://cse.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ నెల 23 నుంచి కూడా అభ్యంతరాలు తెలియజేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.
Similar News
News December 23, 2024
మున్సిపల్ స్కూల్లో చదివి బీఎస్ఎఫ్ జవాన్
తెనాలి ఐతానగర్‌కు చెందిన ఎ. మహాలక్ష్మి సాధారణ పేద కుటుంబంలో జన్మించింది. మున్సిపల్ హైస్కూల్లో చదువుకున్న ఆమె బీఎస్ఎఫ్ జవాన్ కావాలనుకున్న తన లక్ష్యాన్ని సాధించింది. కఠోర శ్రమకు తోడు క్రమశిక్షణతో పట్టుదలగా ప్రయత్నించి ఆర్మీలో ఉద్యోగం సాధించింది. తొలి సారిగా స్వస్థలం తెనాలి వచ్చిన క్రమంలో ఆమె చదివిన ఐతానగర్‌లోని ఎన్ఎస్ఎం హైస్కూల్లో ఉపాధ్యాయులు సోమవారం మహాలక్ష్మిని ఘనంగా సత్కరించారు.
News December 23, 2024
సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే.!
ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం షెడ్యూల్‌ను సీఎం కార్యాలయ అధికారులు విడుదల చేశారు. చంద్రబాబు ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయానికి వెళతారు. సీఆర్డీఏ, బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష చేస్తారు. అనంతరం సాయంత్రం విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్‌లో సెమీ క్రిస్మస్ వేడుకలకు హాజరవుతారని సీఎం కార్యాలయం తెలిపింది.
News December 23, 2024
నేడు అమరావతిపై CRDA కీలక సమావేశం
అమరావతి పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం 44వ CRDA కీలక సమావేశం జరగనుంది. జోన్ 7, జోన్ 10, మౌలిక వసతుల కల్పనకు అథారిటీ ఆమోదం తెలపనుంది. ఇప్పటికే రూ.45,249 కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు ఆమోదం తెలపనున్నట్లు సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. మరో 2వేల కోట్లకు పైబడి పనులు చేపట్టేందుకు ఆమోదం తెలియజేయనుంది.