News April 25, 2024

27న పెద్దాపురానికి పవన్ కళ్యాణ్

image

పెద్దాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈనెల 27న వస్తున్నట్లు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. సామర్లకోట రింగ్ రోడ్ సెంటర్లో శనివారం సాయంత్రం ఐదు గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తామని, పవన్ కళ్యాణ్ సహా ఎన్డీఏ నేతలు పాల్గొంటారని తెలిపారు. పవన్ కళ్యాణ్ సభకు ఏర్పాట్లు చేపట్టినట్లు టౌన్ అధ్యక్షులు అడబాల కుమార్ స్వామి తెలిపారు.

Similar News

News October 13, 2025

ఇండియన్ రెడ్ క్రాస్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం వాయిదా

image

ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ తూ.గో. జిల్లా శాఖ నూతన మేనేజ్‌మెంట్‌ కమిటీ ఏర్పాటు విషయమై ఈ నెల 15న ఉదయం 11 గంటలకు జరగవలసిన సమావేశం వాయిదా పడిందని జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి సోమవారం తెలిపారు. ఉమ్మడి తూ.గో. జిల్లా కాకినాడ నుంచి జాబితా ఇంకా అందకపోవడమే ఇందుకు కారణమని ఆమె పేర్కొన్నారు. తదుపరి సమావేశపు తేదీని త్వరలో ప్రకటిస్తామని కలెక్టర్‌ వెల్లడించారు.

News October 13, 2025

గోకవరం ఆర్ & ఆర్ కాలనీ రోడ్లో DEAD BODY

image

గోకవరం ఆర్ & ఆర్ కాలనీ రోడ్డుపై మృతదేహం కలకలం రేపింది. సోమవారం ఉదయం గుర్తించిన స్థానికులు గోకవరం PSకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 13, 2025

తూ.గో టీడీపీ అధ్యక్ష పదవికి బొడ్డు,యర్రా పేర్లు పరిశీలన..?

image

రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరిని జిల్లా టీడీపీ అధ్యక్షునిగా నియమిస్తారనే గుసగుస వినిపిస్తోంది. జిల్లాలో కాపు సామాజిక వర్గ ప్రాబల్యం అధికంగా ఉండడంతో ఆ వర్గానికి ఇస్తే బాగుంటుందని ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. మరో వైపు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సోదరుడి బావమరిది యర్రా వేణు గోపాల్ రాయుడు పేరు తెరపైకి వచ్చింది. ఇద్దరిలో పదవి ఎవరిని వరిస్తుందనేది వేచి చూడాలి.