News February 26, 2025
27న విద్యాసంస్థలకు సెలవు: డీఈఓ

ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం నిర్వహించనున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యా కమిషనర్ సెలవు ప్రకటించినట్లు డీఈఓ వాసుదేవరావు తెలిపారు. మంగళవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని ఉప విద్యాశాఖ అధికారులకు, ఎంఈఓలు, అన్ని విద్యా సంస్థలకు దీనిపై సర్క్యులర్ అందించినట్లు వివరించారు.
Similar News
News December 16, 2025
విద్యుత్.. అమూల్య సంపద: కలెక్టర్

జాతీయ ఇంధన వారోత్సవాల సందర్భంగా రాజమండ్రి కలెక్టరేట్‌లో మంగళవారం తూర్పు గోదావరి కలెక్టర్ కీర్తి చేకూరి ప్రచార చిత్రాలను ఆవిష్కరించారు. విద్యుత్‌ను కేవలం ప్రకృతి వనరుగా కాకుండా, అమూల్యమైన సంపదగా భావించాలని ప్రజలకు ఆమె హితవు పలికారు. అవసరమైన మేరకే వినియోగిస్తూ, ఇంధన పొదుపును ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
News December 16, 2025
గోపాలపురం: వెంటాడుతూనే వున్న పెద్దపులి భయం

గోపాలపురం మండలం భీమోలు పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. పులి ఆచూకీ కోసం కొండ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఆరు ట్రాకింగ్ కెమెరాలను ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు కెమెరాల్లో పులి జాడలు లభించలేదని డీఎఫ్‌ఓ దావీదు రాజు సోమవారం తెలిపారు. పులి ఇంకా పరిసరాల్లోనే ఉండే అవకాశం ఉన్నందున గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
News December 15, 2025
రాజమండ్రి: పీజీఆర్‌ఎస్‌కు 23 అర్జీలు

తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు 23 అర్జీలు అందాయి. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ స్వయంగా బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల తీవ్రతను బట్టి సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చట్టపరంగా విచారణ జరిపి, బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.


