News October 14, 2024

27వ వసంతంలోకి ద్రావిడ విశ్వవిద్యాలయం

image

కుప్పంలోని ద్రావిడ ద్రావిడ వర్సిటీ 27వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. ఈనెల 20వ తేదీన వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం జరపనున్నట్లు రిజిస్ట్రార్ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ వేడుకలకు చిత్తూరు ఎంపీ డి.ప్రసాద్ రావు, ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పీఎస్ మునిరత్నం, కలెక్టర్ సుమిత్ కుమార్, కడా పీడీ వికాస్ మర్మత్ హాజరవుతారని చెప్పారు.

Similar News

News December 27, 2024

మాజీ మంత్రి రోజా కుమార్తెకు గ్లోబల్ అవార్డు

image

మాజీ మంత్రి ఆర్‌కే రోజా కుమార్తె అన్షు మాలిక సామాజిక ప్ర‌భావానికి సంబంధించిన గ్లోబ‌ల్ ఎంట్ర‌ప్రెన్యూర్స్ అవార్డ్ గెలుచుకున్నారు. దీంతో ఆర్‌కే రోజా మాట్లాడుతూ.. అన్షు మాలిక‌కు గ్లోబ‌ల్ ఎంట్ర‌ప్రెన్యూర్స్ అవార్డు రావడంతో ఎంతో ఆనంందంగా ఉందని అన్నారు. ఆమె కృషి, పట్టుదల ఫలించాయని అన్నారు. ఆనంతరం అభినందనలు తెలిపారు.

News December 27, 2024

మన్మోహన్ సింగ్‌కు తిరుపతి జిల్లాతో ప్రత్యేక అనుబంధం

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తిరుపతి జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. 2010 సెప్టెంబర్ 1న జిల్లాలో రెండు ప్రధాన అభివృద్ధి పనులు ఆయన చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. అందులో ఒకటి తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చే పనులకు శంకుస్థాపన చేశారు. రెండోది మన్నవరం ఎన్టీపీసీ-భెల్‌ ప్రాజెక్టు పనులను మన్మోహన్ సింగ్ శంకుస్థాపన చేసి ప్రారంభించారు.

News December 27, 2024

కాలినడకన తిరుమల చేరుకున్న పీవీ సింధు

image

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన గురువారం తిరుమలకు చేరుకున్నారు. నూతన దంపతులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. శుక్రవారం వేకువజామున ఆమె శ్రీవారి అభిషేక సేవలో స్వామి వారిని దర్శించుకోనున్నారు.