News October 2, 2025
HSCC లిమిటెడ్‌లో 27 పోస్టులు

హాస్పిటల్ సర్వీసెస్ కన్సల్టెన్సీ కార్పొరేషన్(HSCC)లిమిటెడ్ 27 అసిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజినీరింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 13వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంబీఏ, ఇంజినీరింగ్ డిగ్రీ, ఫార్మసీ డిగ్రీ, పీజీ డిప్లొమా, LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: http://hsccltd.co.in/
Similar News
News February 11, 2026
ఇక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయట

ఒడిశాలోని బింకా సమీపంలో మహానది తీరాన ఉన్న పాపాక్షయ ఘాట్‌కు 900 ఏళ్ల చరిత్ర ఉంది. బ్రాహ్మణ హత్య దోషంతో బాధపడిన అనంగ భీమదేవుడు ఇక్కడ స్నానం చేసి విముక్తి పొందాడని కథనం. ఓ ఆవు స్వయంగా పాలిచ్చిన చోట రాజు కపిలేశ్వర శివాలయాన్ని నిర్మించాడు. ఇక్కడి మహానదిలో స్నానం చేసి, శివుడిని దర్శించుకుంటే పాపాలు తొలగి మనశ్శాంతి కలుగుతుందని విశ్వాసం. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ఈ ఘాట్‌కు ఏటా ఎంతో మంది వస్తుంటారు.
News February 11, 2026
సోషల్ మీడియాలో ఫేక్ AI కంటెంట్.. కేంద్రం కీలక ఆదేశాలు

సోషల్ మీడియాలో AI కంటెంట్‌కు SM ప్లాట్‌ఫామ్‌లు తప్పనిసరిగా లేబుల్ వేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తప్పుదోవ పట్టించే లేదా చట్టవిరుద్ధమైన కంటెంట్ తొలగింపు విషయంలో కోర్టు/ప్రభుత్వం ఆదేశించిన 3 గంటల్లోగా తొలగించాలని గడువు విధించింది. అంతకుముందు 36 గంటలు గడువు ఉండగా ఈ నెల 20 నుంచి ఈ ఉత్తర్వులు అమలుకానున్నాయి. AI కంటెంట్ దుర్వినియోగంపై యూజర్లకు 3 నెలలకోసారి అవగాహన కల్పించాలని తెలిపింది.
News February 11, 2026
గోళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే అధిక కొలెస్ట్రాల్

బాడీలో కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగినప్పుడు గోళ్లలో మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గులాబీ రంగులో ఉండే గోళ్లు రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడంతో రంగుమారి పాలిపోయినట్టు/తెల్లగా కనిపిస్తాయి. ఒనికోరెక్సిస్ అని పిలిచే గాట్లు ఏర్పడతాయి. రక్త ప్రవాహం తగ్గడంతో పెరుగుదలకు కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఒంకరగా పెరుగుతాయి. కొందరిలో నీలం/ఊదా రంగులో కనిపిస్తాయి.


