News May 23, 2024

27 నుంచి జూన్ 30 వరకు రైళ్ల రద్దు

image

మూడో లైను పనుల కారణంగా ఈ నెల 27 నుంచి వచ్చే నెల 30 వరకు పలు రైళ్లను రద్దు చేశారు. 07462/63 వరంగల్- సికింద్రాబాద్ పుష్పల్ రైలు, 17035/36 కాజీపేట- బల్లార్షా, 07766/65 కరీంనగర్ -సిర్పూర్ టౌన్, 07894 కరీంనగర్- బోధన్ రైళ్లను వచ్చే నెల 30వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే ప్రకటించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు.

Similar News

News October 1, 2024

MHBD: గురుకులాన్ని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ

image

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లిలో నిర్మించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ గురుకులాన్ని ప్రధాని మోదీ బుధవారం ప్రారంభించనున్నారు. రెండేళ్ల క్రితం కొత్తగూడకు ఏకలవ్య పాఠశాల మంజూరైంది. పొగుళ్లపల్లిలో 9 ఎకరాల విస్తీర్ణంలో రూ.40కోట్లతో భవన నిర్మాణ పనులు చేపట్టగా.. ఇటీవల పనులు పూర్తయ్యాయి. రేపు నరేంద్ర మోదీ వర్చువల్‌గా ఢిల్లీ నుంచి ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.

News October 1, 2024

MHBD: రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతుళ్లకు గాయాలు

image

రోడ్డు ప్రమాదంలో తండ్రి కూతుళ్లకు గాయాలైన ఘటన కొత్తగూడ మండలంలో చోటుచేసుకుంది. MHBD జిల్లా కొత్తగూడ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన మధు.. తన ఇద్దరు కూతుళ్లను నర్సంపేటలో హాస్టల్లో చదివిస్తున్నారు. దసరా సెలవులు రావడంతో మంగళవారం బైకుపై కూతుళ్లతో కలిసి పెగడపల్లికి వస్తున్నాడు. కొత్తగూడ సమీపంలో బైకును కారు ఢీకొట్టడంతో మధు కాలు విరగగా.. ఇద్దరమ్మాయిలకు గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించారు.

News October 1, 2024

నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా

image

వరంగల్ జిల్లా క్రిస్టియన్ కాలనీలోని సీబీసీ చర్చి నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం సమాన ప్రాధాన్యత కల్పిస్తుందని అన్నారు. అనంతరం మంత్రి దంపతులను పలువురు సభ్యులు ఘనంగా సన్మానించారు.