News August 24, 2024

270 మంది స్టీల్ ప్లాంట్ అధికారులకు షోకాజ్ నోటీసులు

image

స్టీల్ ప్లాంట్‌లో 270 మంది ఇంజినీరింగ్ ఇన్‌ఛార్జ్‌ అధికారులకు యాజమాన్యం శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న కాంట్రాక్ట్ పనుల్లో పాల్గొంటున్న ఒప్పంద కార్మికుల విధులకు, కాంట్రాక్టర్ సమర్పించిన హాజరు సరిపోకపోవడంతో ఉద్దేశపూర్వకంగా చేసినట్లు తెలుస్తోందని ఆ నోటీసులో యాజమాన్యం పేర్కొంది. దీనిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని తెలిపింది.

Similar News

News January 17, 2026

విశాఖకు రానున్న రాహుల్ గాంధీ.. ఎప్పుడంటే?

image

పార్లమెంటరీ రక్షణ కమిటీ చైర్మన్ రాధా మోహన్ సింగ్ నేతృత్వంలో ఎంపీల బృందం జనవరి 19 నుంచి మూడు రోజుల పాటు విశాఖలో పర్యటించనుంది. ఈ బృందంలో రాహుల్ గాంధీ, మహువా మోయిత్రా తదితరులు ఉన్నారు. వీరు ఎన్‌ఎస్‌టీఎల్ (NSTL)లో డీఆర్డీఓ ప్రాజెక్టులను, కోస్ట్ గార్డ్ తీరప్రాంత భద్రతను సమీక్షించనున్నారు. వీవీఐపీల రాక నేపథ్యంలో నగరం అంతటా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

News January 17, 2026

విశాఖలో రెండు ట్రావెల్ బస్సులు సీజ్

image

సంక్రాంతి పండుగల నేపథ్యంలో ఉప రవాణా కమిషనర్ ఆర్సీహెచ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు శనివారం విశాఖలో మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌లు, రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని 2 ట్రావెల్ బస్సులను సీజ్ చేసి, నిబంధనలు ఉల్లంఘించిన మరో 5 బస్సులపై కేసుల నమోదు చేసి రూ.60,000 జరిమానాలు విధించారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News January 17, 2026

కేజీహెచ్‌లో రోగులతో మాట్లాడిన కలెక్టర్

image

కేజీహెచ్‌లోని శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వార్డులో పర్యటించారు. వార్డులో చికిత్స పొందుతున్న రోగులతో కలెక్టర్ మాట్లాడగా రోగి సిబ్బందికి డబ్బులు ఇచ్చినట్లుగా చెప్పడంతో విచారణకు ఆదేశించారు. అక్కడే ఉన్న సూపర్డెంట్ ఈ విషయంపై విచారణ చేయాలని వైద్యం కోసం ఏ ఒక్కరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అన్నిచోట్ల ఉచితంగా వైద్య సేవలు అనే బోర్డులు పెట్టాలని సూచించారు