News February 18, 2025

2,734 ఉద్యోగాలు.. గ్రూప్-1,2,3 ఫలితాలపై UPDATE

image

TG: లక్షలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న గ్రూప్-1,2,3 ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. 563 గ్రూప్-1 పోస్టుల ఫలితాలను TGPSC మార్చి మొదటి వారంలో రిలీజ్ చేయనుందని సమాచారం. ఆ నియామకాలు పూర్తయిన వెంటనే 783 గ్రూప్-2, 1,388 గ్రూప్-3 ఉద్యోగాల ఫలితాలను ప్రకటించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు విభాగాల్లో 2,734 పోస్టులకుగాను 5.51లక్షల మంది పోటీ పడ్డారు.

Similar News

News November 11, 2025

ముకేశ్ అంబానీపై CBI విచారణకు పిటిషన్

image

$1.55B విలువైన ONGC గ్యాస్‌ను దొంగిలించారంటూ రిలయన్స్, ముకేశ్ అంబానీపై ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నమ్మకద్రోహం, అక్రమాలతో గ్యాస్‌ను థెఫ్ట్ చేశారని, CBIతో విచారణ చేయించాలని జితేంద్ర పి మారు అనే వ్యక్తి కోర్టును కోరారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు CBI, కేంద్రానికి నోటీసులు జారీచేసింది. అయితే భూమి బ్లాక్‌ల మధ్య గ్యాస్ కదలికలు సహజమని, దాన్ని వెలికితీసే అధికారం తమకు ఉందని RIL పేర్కొంటోంది.

News November 11, 2025

చింతపండుతో శరీరంలోని మైక్రో ప్లాస్టిక్ ఔట్!

image

చింతపండు మైక్రోప్లాస్టిక్‌లతో పోరాడగలదని కొత్త అధ్యయనంలో తేలింది. దీనిలోని ఆమ్లాలు, ఫైబర్స్ జీర్ణవ్యవస్థలో ఉన్న మైక్రోప్లాస్టిక్ కణాలను బంధించి, వాటిని సహజంగా శరీరం నుంచి బయటకు పంపడానికి సహాయపడతాయి. ఆహారం, నీటి ద్వారా శరీరంలోకి చేరే మైక్రో ప్లాస్టిక్‌ను ఇది తొలగిస్తుంది. కాలేయ శుద్ధి, జీర్ణక్రియకు సహాయపడే ఈ చింతపండు ఇప్పుడు ఆధునిక కాలుష్యం నుంచి కూడా రక్షించగలదని ఈ పరిశోధన సూచిస్తోంది.

News November 11, 2025

ఆపరేషన్ సిందూర్ 2.0 స్టార్ట్ అవుతుందా?

image

ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడుకు పాకిస్థాన్ కేంద్రంగా పని చేసే జైషే మహమ్మదే కారణమని నేషనల్ మీడియా చెబుతోంది. పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత జరిగిన మరో ఉగ్రదాడి ఇదే. దీంతో ‘భారత గడ్డపై మరోసారి దాడి జరిగితే సహించేది లేదు’ అని ప్రధాని మోదీ ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇచ్చిన హెచ్చరికలను నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. దీంతో మరోసారి భారత్ యుద్ధం చేస్తుందా? అని పలువురు పోస్టులు చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?