News October 24, 2025
APSRTCలో 277 పోస్టులు.. రేపటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

APSRTCలో 277 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. కర్నూలు(46), నంద్యాల(43), అనంతపురం(50), శ్రీ సత్యసాయి(34), కడప(60), అన్నమయ్య(44) జిల్లాలో ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు రేపటి నుంచి నవంబర్ 8 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.118. అభ్యర్థులను విద్యార్హతలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://apsrtc.ap.gov.in/
Similar News
News February 8, 2026
‘సూపర్ హ్యూమన్స్’ని సృష్టించాలన్న ఎప్‌స్టీన్!

సెక్స్ ట్రాఫికర్ ఎప్‌స్టీన్ ఓ ‘సూపర్ హ్యూమన్ రేస్’ను సృష్టించాలని ప్రయత్నించినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. “మరణానికి ముందు తన వింత కోరికను వెలిబుచ్చారు. తన DNAతో గొప్ప మేధస్సు కలిగిన పిల్లలను పుట్టించాలని కోరారు. గతంలోనూ న్యూమెక్సికోలోని తన పెద్ద పశువుల పాక(RANCH)లో మహిళలను గర్భవతులను చేయాలని శాస్త్రవేత్తలతో తరచూ చెప్పేవారు. కొందరు దానిని ‘BABY RANCH’ అని పిలిచేవారు” అని NYT పేర్కొంది.
News February 8, 2026
YS జగన్‌తో TVK విజయ్

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్, తమిళ సినీ హీరో, టీవీకే అధినేత విజయ్ చెన్నైలో జరిగిన వెడ్డింగ్ ఈవెంట్‌లో కలిశారు. జగన్ సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి పెళ్లి వేడుకకు విజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ పక్కపక్కన కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
News February 8, 2026
ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు: CM

TG: రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను ఏప్రిల్ తర్వాత ఇస్తామని CM రేవంత్ చెల్పూర్ సభలో ప్రకటించారు. గోదావరి సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేసే యోచన లేదన్నారు. సింగరేణి కార్మికులకు నష్టం చేకూర్చే ఏ పనిని ప్రభుత్వం చేపట్టదని స్పష్టం చేశారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతాలను, దేవాలయాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇందుకోసం రూ.3వేలకోట్లయినా ఖర్చు చేస్తామన్నారు.


