News April 8, 2025

2780 ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం: కలెక్టర్

image

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ బి రాంబాబుతో కలిసి కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలో ఇప్పటివరకు ప్రజావాణి ద్వారా 3462 దరఖాస్తులు రాగా వాటిలో 2780 దరఖాస్తులను పరిష్కరించడం జరిగిందని చెప్పారు.

Similar News

News April 17, 2025

మంచిర్యాల: ఒకరి అరెస్ట్.. ఇద్దరు పరార్

image

మంచిర్యాల జిల్లాకేంద్రంలోని బాయ్స్ హైస్కూల్ ఏరియాలో గంజాయి కలిగి ఉన్న ముగ్గురిలో ఒకరిని పోలీసులు బుధవారం పట్టుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు ఎస్సై ప్రవీణ్ కుమార్ సిబ్బందితో కలిసి వెళ్లగా ఇద్దరు పారిపోయారు. మాడవి జీవన్ జాషువాను పట్టుకున్నారు. అతడి నుంచి 1.080కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండుకు పంపించారు.

News April 17, 2025

మంచిర్యాలలో ఐదుగురి ARREST

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలీవాడలో గట్టం రాజు ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై బుధవారం పోలీసులు దాడి చేశారు. తమకు అందిన సమాచారంతో ఎస్సై ప్రవీణ్ కుమార్ సిబ్బందితో దాడి చేసి గట్టం రాజు, దొడ్ల శ్రీనివాస్, మొటం రాజు, జాబరి శ్యామ్‌రావు, సమ్మయ్యను పట్టుకున్నారు. వారి నుంచి రూ.30,050 నగదు, 3 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News April 17, 2025

నారాయణపేట జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు 

image

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లు జరగకుండా చూడాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. నారాయణపేట కలెక్టరేట్‌లో బుధవారం ఎంపీడీవో, ఎంపీవో, మున్సిపల్ కమిషనర్లు, అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి ఆమె సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని చెప్పారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా ఈనెల 21 వరకు లబ్ధిదారుల జాబితా ఎంపీడీవో ఆఫీసులకు చేరుతుందని చెప్పారు.

error: Content is protected !!