News September 26, 2024
28న ఉమ్మడి జిల్లా అథ్లెటిక్స్ ఎంపికలు

స్కూల్ గేమ్స్ జూనియర్ కాలేజ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 28న ఉమ్మడి మెదక్ జిల్లా అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ గణపతి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మెదక్‌లోని ఇందిరాగాంధి స్టేడియంలో అండర్-19 బాలబాలికల విభాగంలో ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఉదయం 9 గంటల వరకు పదోతరగతి మెమో, బోనాఫైడ్, బర్త్ సర్టిఫికెట్, ఆధార్‌కార్డుతో హాజరుకావాలని తెలిపారు.
Similar News
News September 13, 2025
రాష్ట్ర కళా ఉత్సవ్‌కు మెదక్ జిల్లా విద్యార్థులు ఎంపిక

రాష్ట్ర స్థాయిలో జరిగే కళా ఉత్సవ్-2025 పోటీలకు మెదక్ జిల్లా నుంచి పలువురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని డీఈఓ రాధా కిషన్ తెలిపారు. వ్యక్తిగత విభాగంలో ఎస్. కౌడిపల్లి, బాలాజీ, శ్రీహర్షిని, ఆర్తిచంద్ర, సాత్విక్ ఎంపిక కాగా, బృందంలో స్పందన, మహేష్, కావేరి, సుర్తిత్రిక, పవన్ ఎంపికైనట్లు ఆయన వెల్లడించారు. వీరిని డీఈఓ , పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.
News September 12, 2025
పెద్ద శంకరంపేట : మనస్థాపంతో బావిలో దూకి యువకుడి మృతి

పెద్ద శంకరంపేట మండలంలోని ముసపేటకి చెందిన గంగమేశ్వర్ మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్ళిఅతడు తిరిగి రాలేదు. గంగమేశ్వర్ ఇటీవల ఓ కేసులో జైలుకు వెళ్ళి పది రోజుల క్రితమే బెయిల్ మీద బయటకు వచ్చాడు. మనస్థాపంతోనే బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని అతడి తండ్రి దేవయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 12, 2025
ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం ఆయన మెదక్ మున్సిపాలిటీలోని గోల్కొండ వీధి, గాంధీనగర్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల నుంచి ప్రజలను రక్షించడానికి శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించాలని అధికారులకు సూచించారు.