News July 26, 2024
28న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జట్టు ఎంపిక

ఏలూరు కోటదిబ్బ కస్తూర్బా నగర బాలికోన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈ నెల 28న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్స్ బాలబాలికల జిల్లా స్థాయి జట్లను ఎంపిక చేయనున్నట్లు ఆ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణారెడ్డి, శ్రీనివాసరావు తెలిపారు. పోటీల్లో పాల్గొనేవారు 1- 1- 2011 తర్వాత జన్మించి ఉండాలన్నారు. తమ వెంట జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు తెచ్చుకోవాలన్నారు.
Similar News
News October 28, 2025
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లాలో 200 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున, అధికారులు 24 గంటలూ అప్రమత్తతతో ఉండాలని కలెక్టర్ నాగరాణి మంగళవారం గూగుల్ మీట్ ద్వారా సమీక్షలో ఆదేశించారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, మండలాలకు పంపిన డ్రోన్స్ వెంటనే వినియోగించాలని సూచించారు. ఏ సమస్య వచ్చినా తక్షణం పరిష్కరించాలని స్పష్టం చేశారు.
News October 28, 2025
రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్

మొంథా తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుధవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు, పాఠశాలలకు, అంగన్వాడీలకు కలెక్టర్ చదలవాడ నాగరాణి సెలవు ప్రకటించారు. ఉత్తర్వులను అన్ని విద్యాసంస్థలు తప్పకుండా పాటించాలని ఆదేశించారు. పిల్లలు బయట తిరగనివ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు.
News October 28, 2025
ప.గో జిల్లాలో 583.8 మి.మీ. వర్షపాతం

గడిచిన 24 గంటల్లో జిల్లాలో 583.8 మి.మీల వర్షపాత నమోదు అయినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సరాసరి 29.2 మి.మీ కాగా అత్యధికంగా యలమంచలిలో 53.6, నరసాపురంలో 49.6, పాలకొల్లులో 49.2, ఆచంటలో 43.8, మొగల్తూరులో 42.4 మి.మీలు నమోదయింది. అత్యల్పంగా గణపవరం 13.6 మి.మీ, తాడేపల్లిగూడెం 14.0, అత్తిలిలో 16.6 మి. మీ నమోదు అయినట్టు అధికారులు తెలిపారు.


