News September 25, 2024
28న ఎంజే మార్కెట్‌లో గజల్, షాయరీ
సిటీ వారసత్వాన్ని కాపాడడంతోపాటు, కళలను ప్రోత్సహించేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ నెల 28న సాయంత్రం ఎంజే మార్కెట్ ప్రాంగణంలో గజల్, షాయరీ నిర్వహించనున్నారు. దీన్ని వినిపించడానికి ప్రముఖ కళాకారులు రాన్నారు. బుక్‌మై షోలో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిగా ఉన్నవారు బుక్ చేసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరారు.
Similar News
News October 6, 2024
HYD: రూ.100 కోట్ల అండర్ ట్యాంకుల నిర్మాణం
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రూ.100 కోట్ల వ్యయంతో 50 ప్రాంతాల్లో 10 లక్షల లీటర్ల వరద నీటి నిల్వ సామర్థ్యం కలిగిన అండర్ ట్యాంక్స్ నిర్మిస్తోంది. GHMC కమిషనర్ ఆమ్రపాలి తెలిపిన వివరాల ప్రకారం.. ముఖ్యమైన 18 చోట్ల భూగర్భ ట్యాంకులు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ నగరంలో వరద నీరు నిలిచే 141 ప్రాంతాలను 50కి తగ్గించడంలో కీలకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
News October 6, 2024
HYD: కాసేపట్లో రాజేంద్రప్రసాద్ కుమార్తెకు అంత్యక్రియలు
సినీ నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె శనివారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. కాగా ఆయన కుమార్తెకు అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. KPHB ఇందు విల్లాస్‌లో రాజేంద్రప్రసాద్‌ను సినీ, రాజకీయ ప్రముఖులు ఓదార్చి గాయత్రి భౌతికకాయానికి పలువురు నివాళులర్పించారు. ఆదివారం కేపీహెచ్‌బీలోని కైలాసవాసంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
News October 6, 2024
HYD: మోసాలకు అడ్డా.. ‘గోల్డెన్ ట్రయాంగిల్’
HYD మహా నగరంలో ఆన్‌లైన్ మోసాలతో రూ.కోట్లు మాయమవుతున్న ఘటనలు బయటపడ్డాయి. BHEL టౌన్షిప్ విశ్రాంత ఉద్యోగి ఖాతా నుంచి రూ.13.16 కోట్లు, KPHB వైద్యుడి నుంచి రూ.8.6 కోట్లు, నోయిడా వ్యాపారి అకౌంట్ నుంచి రూ.9.09 కోట్లు మాయమయ్యాయి. ఈ సొమ్ము ‘గోల్డెన్ ట్రయాంగిల్’గా పిలిచే థాయ్‌లాండ్ , లావోస్, మయన్మార్ దేశాల్లోని ముఠాల చేతుల్లోకి వెళ్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గుర్తించింది.