News March 27, 2025

28న కాకినాడలో ఇఫ్తార్ విందు: కలెక్టర్ 

image

కాకినాడలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో ఈ నెల 28న సాయంత్రం 5.30 గంటలకు ముస్లిం మైనారిటీల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు కలెక్టరు షాన్మోహన్ సగిలి తెలిపారు. రంజాన్ ఉపవాస దీక్ష సందర్భంగా ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కావున ప్రజా ప్రతినిధులు, ముస్లిం పెద్దలు, జిల్లా అధికారులు ఇఫ్తార్ విందుకు హాజరుకావాలని కలెక్టర్ కోరారు.

Similar News

News September 16, 2025

KNR: GST ఎఫెక్ట్.. వెలవెలబోతున్న షోరూమ్స్..!

image

కొత్త GST విధానం ఈనెల 22 నుంచి అమల్లోకి రానుంది. దీంతో పలు వస్తువుల ధరలు భారీగా తగ్గే అవకాశముంది. కొత్త GST స్లాబులు వచ్చేవరకు కస్టమర్లు వెయిట్ చేస్తుండడంతో ఎలక్ట్రానిక్స్, కార్లు, బైకులు, త్రిచక్రవాహనాల షోరూంలు వెలవెలబోతున్నాయి. ఉమ్మడి KNR వ్యాప్తంగా కార్స్ 9%, బైక్స్ 7%, ఎలక్ట్రానిక్స్ ధరలు 5% తగ్గనున్నాయి. కొత్త GSTతో పాటు దసరా, దీపావళి ఆఫర్లతో ఒక్కసారిగా కొనుగోళ్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.

News September 16, 2025

MHBD: విద్యార్థిని చితకబాదిన దుకాణం యజమాని

image

చాక్లెట్లు కొనేందుకు దుకాణానికి వెళ్లిన విద్యార్థిని చితకబాదిన ఘటన కురవి మండలం కంచర్లగూడెంలో చోటుచేసుకుంది. కంచర్లగూడెం పాఠశాలలో విద్యార్థి ఆకాశ్ 5వ తరగతి చదువుతున్నాడు. చిన్నారులు ఏడుస్తుండటంతో చాక్లెట్ల కోసం అతన్ని టీచర్ షాపునకు పంపాడు. అక్కడే ఉన్న కోతులు దాడి చేస్తాయని షాపులోకి వెళ్లిన అతన్ని యజమాని చూశాడు. కోతులు రావడంతో షాపులోకి వచ్చానని చెప్పినా వినకుండా చితకబాదినట్లు బాధితులు తెలిపారు.

News September 16, 2025

ప్రసారభారతిలో ఉద్యోగాలు

image

న్యూఢిల్లీలోని <>ప్రసార భారతి<<>> 50 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు ఉద్యోగ అనుభవం గల వారు ఈనెల 25లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులను రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://prasarbharati.gov.in/