News February 25, 2025

28న తిరుపతిలో జాబ్ మేళా

image

APSSDC ఆధ్వర్యంలో తిరుపతిలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(NAC)లో ఈనెల 28వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. 2 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ఇంటర్, ఏదైనా డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. నిరుద్యోగ అభ్యర్థుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News October 21, 2025

తొలి వన్డేలో ఆ ప్లేయర్‌ను తీసుకోవాల్సింది: కైఫ్

image

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఆడించి ఉండాల్సిందని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డారు. తుది జట్టులో అన్నీ కవర్ చేసినా వికెట్ టేకింగ్ బౌలర్‌ను తీసుకోలేదని చెప్పారు. AUS దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ అన్ని ఫార్మాట్లలో రాణించారని గుర్తు చేశారు. తొలి వన్డేలో ఆసీస్ స్పిన్నర్ మాథ్యూ కునెమన్ 2 వికెట్లు తీశారని తెలిపారు. క్వాంటిటీ కోసం క్వాలిటీ విషయం రాజీ పడ్డారన్నారు.

News October 21, 2025

జనగామ: పంట కల్లాలకు మోక్షం ఎప్పుడో!

image

ధాన్యం దిగుబడి వచ్చిన రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టేందుకు కల్లాలు లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పొలాలు, రహదారులపై ఆరబోసుకుంటున్నారు. జిల్లాలో రెండు లక్షలకు పైగా రైతులంటే కేవలం 4 వేల పంట కల్లాలు ఉండటం గమనార్హం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పంట కల్లాల నిర్మాణం చేపట్టాలని జిల్లాల్లోని రైతులు కోరుతున్నారు.

News October 21, 2025

అమెరికన్లకు ట్రంప్ దీపావళి విషెస్

image

ప్రపంచ దేశాధినేతలు సైతం హిందువులనుద్దేశించి దీపావళి విషెస్ చెబుతారు. అయితే US అధ్యక్షుడు ట్రంప్ ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి అమెరికన్‌కు విషెస్ తెలియజేశారు. ఈ పండుగ కుటుంబాలను, స్నేహితులను, కమ్యూనిటీలను ఏకం చేసి నమ్మకాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. అయితే హిందువులు, ఇండియన్స్‌ను విష్ చేయకుండా ట్రంప్ బుద్ధి చూపిస్తున్నాడని పలువురు కామెంట్లు చేస్తున్నారు.