News September 22, 2024

28న నల్సార్ యూనివర్సిటీకి రాష్ట్రపతి

image

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ నెల 28న ఉదయం నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవం, సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో జరిగే భారతీయ కళా మహోత్సవంలో ఆమె పాల్గొంటారని రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివరించారు. ఈ మేరకు సీఎస్ అధికారులతో సమావేశమై ఈరోజు సమీక్ష నిర్వహించారు. తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Similar News

News October 9, 2024

HYD: దసరా.. ఊరెళ్లేవారికి ఛార్జీల మోత!

image

బతుకమ్మ నేపథ్యంలో TGRTC ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు పెంచారని ప్రయాణికులు వాపోతున్నారు. సాధారణ ఛార్జీల కంటే స్పెషల్ బస్సుల్లో దాదాపు 25 శాతం అధికంగా ఉన్నట్లు ఓ ప్రయాణికుడు తెలిపారు. పండుగ వేళ తమ జేబులకు చిల్లు పడుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఉప్పల్‌ అధికారులను వివరణ కోరగా.. కేవలం స్పెషల్‌ బస్సులకే మాత్రమే ఈ ధరలు వర్తిస్తాయన్నారు.

News October 9, 2024

RR: జనాభా ఆధారంగా పంచాయతీలకు నిధులు

image

RR, MDCL, VKB జిల్లాలలో గ్రామ పంచాయతీలకు ఇటీవలే నిధులు విడుదల చేశారు. 3 వేలలోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.50 వేలు, 3వేల నుంచి 8వేల జనాభా ఉన్న పంచాయతీలకు రూ.75 వేలు, 8వేలకు పైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.లక్ష చొప్పున నిధులు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. జనాభా ప్రాతిపదికన కేటాయింపులు జరిగినట్లు తెలిపారు.

News October 9, 2024

బతుకమ్మ: రేపు దద్దరిల్లనున్న హైదరాబాద్!

image

సద్దుల బతుకమ్మ వేడుకలకు రాజధాని ముస్తాబైంది. ఎల్బీస్టేడియం, ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్‌ అంతటా రేపు రాత్రి సందడే సందడి. వేలాది మంది ఆడపడుచులు అందంగా బతుకమ్మలను పేర్చి, గౌరమ్మను చేసి ట్యాంక్‌బండ్‌‌కు తీసుకొస్తారు. హుస్సేన్‌సాగర్‌తో పాటు బాగ్‌లింగంపల్లి, KPHB, సరూర్‌నగర్, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్‌లోని GHMC మైదానాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు బతుకమ్మ పాటలతో హైదరాబాద్‌ హోరెత్తనుంది.