News September 20, 2024

28న నెల్లూరు జిల్లా విజయ డెయిరీ ఎన్నికలు

image

నెల్లూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి(విజయ డెయిరీ) ఎన్నికలను ఈనెల 28న నిర్వహించనున్నామని ఎన్నికల అధికారి హరిబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 20న నోటిఫికేషన్ జారీ చేస్తారు. 23న నామినేషన్ల స్వీకరణ, అదే రోజున పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 24వ తేదీ గడువు. 28న ఓటింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం ఓట్లను లెక్కిస్తారు.

Similar News

News December 21, 2025

పెంచలకోనలో విశేష పూజలు

image

పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం, కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.

News December 20, 2025

నెల్లూరు: ఈ నంబర్ మీ వద్ద ఉందా.?

image

వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పోలీస్ సేవలు అందుబాటులో ఉన్నట్లు SP డా.అజిత వేజెండ్ల తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా, వేగంగా సేవలు అందించాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 9552300009 మనమిత్ర వాట్సాప్ సేవలను అందబాటులోకి తెచ్చిందన్నారు. ఈ-చలానా చెక్, ఎఫ్ఐఆర్ కాపీ డౌన్లోడ్, కేసు స్థితిగతులను తెలుసుకోవచ్చని ఆమె తెలిపారు. దీని వలన ప్రజల సమయం ఆదాకావడంతోపాటు ప్రజలకు పోలీసులు మరింత చేరువవుతారు.

News December 20, 2025

పల్స్ పోలియోపై వైద్య ఆరోగ్యశాఖ అవగాహన ర్యాలీ

image

పోలియో కార్యక్రమంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆదివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్వో కార్యాలయం నుంచి గుప్తా పార్కు సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీని జిల్లా వైద్యశాఖ అధికారి సుజాత జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 2,94,604 మంది ఐదేళ్లలోపు పిల్లలకు పల్స్ పోలియో కేంద్రాల ద్వారా పోలియో చుక్కలు అందించనున్నామన్నారు. 21 నుంచి మూడు రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.