News September 20, 2024

28న నెల్లూరు జిల్లా విజయ డెయిరీ ఎన్నికలు

image

నెల్లూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి(విజయ డెయిరీ) ఎన్నికలను ఈనెల 28న నిర్వహించనున్నామని ఎన్నికల అధికారి హరిబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 20న నోటిఫికేషన్ జారీ చేస్తారు. 23న నామినేషన్ల స్వీకరణ, అదే రోజున పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 24వ తేదీ గడువు. 28న ఓటింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం ఓట్లను లెక్కిస్తారు.

Similar News

News October 9, 2024

సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండండి: నెల్లూరు SP

image

కస్టమ్స్, CBI, ED, ఏసీబీ అధికారులమని చెప్పి సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని నెల్లూరు ఎస్పీ జి.కృష్ణ కాంత్ సూచించారు. నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీని వినియోగించుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ‘డిజిటల్ అరెస్ట్’ పేరిట వచ్చే కాల్స్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు.

News October 9, 2024

నెల్లూరు: క్రికెట్‌ ఆడటానికి వెళ్తూ యువకుడి మృతి

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది. గూడూరు నియోజకవర్గం కోట పట్టణానికి చెందిన ప్రసాద్ కుమారుడు కార్తిక్(19) తన స్నేహితుడితో కలిసి క్రికెట్ ఆడటానికి బైకుపై విద్యానగర్‌కు బయల్దేరాడు. ఈక్రమంలో HP పెట్రోల్ బంక్ వద్ద బైకు అదుపుతప్పి గోడను ఢీకొట్టడంతో తలకు పెద్ద గాయమైంది. స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.

News October 9, 2024

నెల్లూరు: నేటి నుంచి K.G రూ.50కే టమోటాలు

image

నెల్లూరు జిల్లా రైతుబజార్‌ల‌లో నేటి నుంచి కిలో రూ.50 చొప్పున సబ్సిడీపై టమోటాల విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ ఏడీ అనితాకుమారి పేర్కొన్నారు. ప్రధానంగా నెల్లూరులోని పత్తేఖాన్ పేట, నవాబుపేట రైతుబజార్లో పాటు, కావలి, కందుకూరు, పొదలకూరు రైతుబజారులలో టమోటాలు విక్రయిస్తారన్నారు. రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు తీసుకుని రావాలని, ఒకరికి రెండు కిలోలు మాత్రమే ఇస్తామన్నారు.