News May 26, 2024
28న షార్ నుంచి రాకెట్ ప్రయోగం

సూళ్లూరుపేట మండలం శ్రీహరికోటలోని షార్ నుంచి మే 28న అగ్నిబాణ్ సార్టెడ్ రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఉదయం 5.45 గంటలకు షార్‌లోని ప్రైవేటు లాంచ్ పాడ్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. చెన్నైకి చెందిన అంతరిక్ష స్టార్టప్ సంస్థ అగ్నికుల్ కాస్మోస్ ఆధ్వర్యంలో ఈ రాకెట్ రూపొందించారు. సింగిల్ పీస్ 3డీ ప్రింటెడ్ ఇంజిన్‌తో ఈ రాకెట్ పనిచేస్తుందని అధికారులు వెల్లడించారు.
Similar News
News December 17, 2025
నెల్లూరు కలెక్టర్‌కు CM ప్రశంస

అమరావతిలోని సచివాలయంలో బుధవారం CM చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా పాల్గొన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం అని CM చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. CM సూపర్ సిక్స్, సూపర్ హిట్ ప్రాజెక్ట్‌లో సక్సెస్ సాధించిన కలెక్టర్లను అభినందించారు. ఫైల్ క్లియరెన్స్‌లో 2వ స్థానం సాధించినందుకు హిమాన్షు శుక్లాను CM ప్రత్యేకంగా ప్రశంసించారు.
News December 17, 2025
భారత ఉపరాష్ట్రపతిని కలిసిన MP వేమిరెడ్డి

నెల్లూరు MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బుధవారం ఢిల్లీలో భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి కార్యాలయానికి బుధవారం MP వెళ్లారు. ఇందులో భాగంగా వేమిరెడ్డి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం వారు అంశాలపై చర్చించారు.
News December 17, 2025
నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ పూర్తి చేయండి: MP

నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ పూర్తి చేయాలని భారత రైల్వే బోర్డు ఛైర్మన్ సంతోశ్ కుమార్‌ను ఢిల్లీలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. బుధవారం ఆయన్ను MP మర్యాదపూర్వకంగా కలిశారు. బిట్రగుంట అభివృధ్ధి, ROB, RUBల పూర్తి, వివిధ ప్రాంతాల్లో ప్రధాన ట్రైన్లకు హాల్టింగ్ ఏర్పాటుపై చర్చించారు. జిల్లాలో రైల్వే పరిధిలో పెండింగ్‌లో ఉన్న అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు.


