News March 23, 2025

28న చింతలూరు నూకాంబిక జాతర

image

ఆలమూరు మండలం చింతలూరులో కొలువైయున్న నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు ఈనెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగుతాయని ఆలయ కమిటీ శనివారం తెలిపింది. 28వ తేదీ శుక్రవారం అమ్మవారి జాతర జరుగుతుందన్నారు. 29వ తేదీ శనివారం తీర్థం జరుగుతుందని చెప్పారు. 30వ తేదీ ఆదివారం ఉగాది ఉత్సవం నిర్వహిస్తామన్నారు. జాతర మహోత్సవాల సందర్భంగా ఆలయం వద్ద భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News December 18, 2025

ప్రశాంత వాతావరణంలో ముగిసిన పంచాయతీ ఎన్నికలు: జిల్లా ఎస్పీ

image

జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ నితికా పంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారి నుంచి రూ. 6.49 లక్షల విలువైన మద్యం, గంజాయి, నగదు, చీరలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. 800 మంది పోలీసులు, 200 మంది ఇతర సిబ్బంది విధులు నిర్వహించారని వెల్లడించారు. రౌడీషీటర్లను, అనుమానితులను బైండోవర్ చేశామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

News December 18, 2025

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ కూడా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.330 పెరిగి రూ.1,34,840కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.300 ఎగబాకి రూ.1,23,600 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,000 పెరిగి రూ.2,24,000కు చేరింది. వెండి ధర రెండ్రోజుల్లోనే రూ.13వేలు పెరగడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 18, 2025

SKLM: సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు..!

image

సంక్రాతి పండగకు ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అధనంగా 16 ప్రత్యేక రైళ్లను నడవనున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బుధవారం శ్రీకాకుళంలో వెల్లడించారు. జనవరి 9 నుంచి 19 మధ్య ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ప్రత్యేక రైళ్ల కేటాయింపు విషయంలో ఇది వరకే ఉన్నతాధికారులకు స్పష్టమైన సూచనలు చేసినట్టు తెలిపారు.