News February 25, 2025

28న తిరుపతిలో జాబ్ మేళా

image

APSSDC ఆధ్వర్యంలో తిరుపతిలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(NAC)లో ఈనెల 28వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. 2 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ఇంటర్, ఏదైనా డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. నిరుద్యోగ అభ్యర్థుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News November 9, 2025

ఓట్ చోరీ కవరింగ్ కోసమే SIR: రాహుల్

image

దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం దాడికి గురవుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ‘భారీగా ఓట్ల దొంగతనం జరుగుతోంది. హరియాణాలో మాదిరే MP, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో జరిగింది. ఇది BJP, ECల వ్యవస్థ. నా దగ్గర మరిన్ని ఆధారాలు ఉన్నాయి. త్వరలోనే బయటపెడతా’ అని తెలిపారు. ‘ఓట్ చోరీ అనేది ప్రధాన సమస్య. దాన్ని కప్పిపుచ్చేందుకు, ఎన్నికల దుర్వినియోగాన్ని వ్యవస్థీకృతం చేసేందుకే <<18119730>>SIR<<>>’ అని ఆరోపించారు.

News November 9, 2025

వరంగల్ కమిషనరేట్ పరిధిలో 102 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

image

మద్యం తాగి వాహనాలు నడపడం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మొత్తం 102 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ విభాగంలో 64, సెంట్రల్ జోన్ పరిధిలో 16, వెస్ట్ జోన్ పరిధిలో 9, ఈస్ట్ జోన్ పరిధిలో 13 కేసులు నమోదయ్యాయి.

News November 9, 2025

HYD: తండ్రి మరణం తట్టుకోలేక యువతి సూసైడ్

image

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. తండ్రి మరణాన్ని తట్టుకోలేక సౌమ్య అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది.బ్లాక్ నంబర్–4 అపార్ట్‌మెంట్స్‌లోని మూడో అంతస్తు నుంచి దూకిన ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ప్రాణాలు నిలువలేదు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.