News October 24, 2025
28న ప్రజా ఉద్యమం: భూమన

రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 28న ‘ప్రజా ఉద్యమం’ చేపట్టనున్నట్లు వైసీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
Similar News
News October 24, 2025
పాలమూరు: మళ్లీ పాలెం భయానకం.. చిన్నటేకూరు దుర్ఘటన

కర్నూలు సమీపంలోని చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదం 2013 అక్టోబర్ 30న జరిగిన పాలెం దుర్ఘటనను తలపించింది. అప్పట్లో 45 మంది సజీవదహనం కాగా, ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 22 మంది గాయాలతో బయటపడ్డారు. మంటల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోవడం వంటి రెండు చోట్లా ఒకే తరహా భయానక దృశ్యం కనపడింది.
News October 24, 2025
తల్లి, కూతురు మృతితో పాపన్నపేట, శివ్వాయిపల్లిలో విషాదం

బస్సు దగ్ధం ఘటనలో తల్లి కూతుళ్లు సజీవ దహనం కాగా మెట్టినిల్లు మెదక్ మండలం శివ్వాయపల్లి, పుట్టినిల్లు పాపన్నపేటలో తీవ్ర విషాదం అలుముకుంది. విదేశాల్లో ఉంటున్న ఆనంద్ కుటుంబం అప్పుడప్పుడు కుటుంబీకులను పలకరించేందుకు వచ్చి వెళ్లే వారు. ఇలా ప్రమాదంలో మృతిచెందడంతో పలువురు కన్నీరుమున్నీరవుతున్నారు. సంధ్యారాణి పాపన్నపేట మాజీ సర్పంచ్ గురుమూర్తి సోదరి. రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది.
News October 24, 2025
అడవులను కబ్జా చేస్తే ఎవరినీ ఉపేక్షించం: పవన్

AP: అడవుల ఆక్రమణలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని Dy.CM పవన్ హెచ్చరించారు. రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల వర్క్ షాప్‌లో మాట్లాడారు. ‘శేషాచలం అడవుల్లో ఎర్రచందనం విత్తనాలు చల్లించేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఎకో టూరిజం ప్రోత్సాహంతో గిరిజన యువతకు ఉపాధి కల్పిస్తాం. అటవీ శాఖ సిబ్బంది భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తాం. రాష్ట్రంలో గ్రేట్ గ్రీన్ వాల్ నిర్మాణానికి కృషి చేద్దాం’ అని పిలుపునిచ్చారు.


