News August 26, 2025
28 నుంచి డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్

ఈ నెల 28 నుంచి డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ మొదలవుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,600 మంది అభ్యర్థుల కౌన్సిలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. ఈ కార్యక్రమం కోసం మూడు ప్రాంతాలలో 54 బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
Similar News
News August 26, 2025
హైదరాబాద్ హాఫ్ మారథాన్‌లో కర్నూలు వాసి సత్తా

హైదరాబాద్‌లో జరిగిన హాఫ్ మారథాన్ రన్ రేస్‌లో కర్నూలు నగరానికి చెందిన హిమబిందు ప్రతిభ కనబరిచారు. మూడు ప్రధాన ఫ్లైఓవర్ల మీదుగా 21 కిలోమీటర్లు పరిగెత్తి, కేవలం 2 గంటల 53 నిమిషాల్లోనే పూర్తి చేశారు. హిమబిందు విజయంతో జిల్లాలోని క్రీడాభిమానులు, క్రీడాసంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. హిమబిందు ప్రదర్శన నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని వారు అభినందించారు.
News August 25, 2025
క్రిష్ణగిరి: ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన బాబాయి, అబ్బాయి

క్రిష్ణగిరి మండలంలోని మారుమూల గ్రామం బి.ఎర్రబాడులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన కలుగొట్ల మల్లికార్జున ఎస్జీటీ టీచర్ ఉద్యోగం పొందగా, ఆయన అబ్బాయి కలుగొట్ల మంజునాథ్ ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం సాధించారు. తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావడంతో గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
News August 25, 2025
కర్నూలు: DSC-2025 సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాయిదా

రేపటి రోజు జరగాల్సిన DSC-2025 సర్టిఫికెట్ వెరిఫికేషన్ వాయిదా వేయడం జరిగిందని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి వెరిఫికేషన్ తేదీనీ రాష్ట్ర విద్యాశాఖ అనుమతుల మేరకు ప్రకటించడం జరుగుతుందని వెల్లడించారు. డీఎస్సీ అభ్యర్థులు కీలక మార్పును గమనించి సహకరించాలని కోరారు.