News March 3, 2025
280 మంది ఇంటర్ పరీక్షలు రాయలేదు: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో సోమవారం ప్రారంభమైన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 280 మంది గైర్హాజరైనట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. జనరల్, వొకేషనల్ విభాగాలకు కలిపి మొత్తం 12,318 మంది విద్యార్థులకు గాను 12,038 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగలేదని కలెక్టర్ స్పష్టం చేశారు.
Similar News
News November 18, 2025
ఆవు తొలిచూలు, బర్రె మలిచూలు

ఆవు మొదటిసారి(తొలిచూలు) ఈనేటప్పుడు సాధారణంగా ఎక్కువ పాలు ఇవ్వకపోవచ్చు లేదా దూడ బలంగా ఉండకపోవచ్చు. అంటే, ఏదైనా ఒక పని తొలి ప్రయత్నంలో ఆశించినంత మంచి ఫలితాలు రాకపోవచ్చు. అదే బర్రె రెండోసారి(మలిచూలు) లేదా ఆ తర్వాత ఈనేటప్పుడు దూడ ఆరోగ్యంగా ఉండటంతో పాటు పాలు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే కొన్నిసార్లు తొలి ప్రయత్నం సరిగా లేకున్నా.. మలి ప్రయత్నం మెరుగైన ఫలితాలను ఇస్తుందని ఈ సామెత అర్థం.

వి‘పత్తి’.. తగ్గిన దిగుబడి, పెరగని రేటు!

APలో ఇటీవల తుఫానుతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. దిగుబడి తగ్గడంతోపాటు నాణ్యతా లోపించింది. దీంతో మద్దతు ధర అందడం లేదు. MSP ₹7,710-8,110 ఉండగా, ₹7వేల లోపే ధర పలుకుతోంది. CCI కేంద్రాల్లో తేమ పరీక్షతో ధర తగ్గించడం, శ్లాబుల వల్ల ఎదురుచూడలేక ప్రైవేటు వ్యాపారులకు రైతులు అమ్ముతున్నారు. పెట్టుబడి ఖర్చులూ రావట్లేదని వాపోతున్నారు. అటు తెలంగాణలో జిన్నింగ్ మిల్లుల సమ్మెతో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి.