News March 3, 2025

280 మంది ఇంటర్ పరీక్షలు రాయలేదు: కలెక్టర్

image

అనకాపల్లి జిల్లాలో సోమవారం ప్రారంభమైన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 280 మంది గైర్హాజరైనట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. జనరల్, వొకేషనల్ విభాగాలకు కలిపి మొత్తం 12,318 మంది విద్యార్థులకు గాను 12,038 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగలేదని కలెక్టర్ స్పష్టం చేశారు.

Similar News

News December 15, 2025

మిరుదొడ్డి: గొర్రెల కాపరి నుంచి ఉపసర్పంచిగా..

image

సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగిన వైనం ఇది. రెండో విడత స్థానిక ఎన్నికల్లో గొర్రెల కాపరిగా జీవనం సాగించిన పెద్ద కురుమ కరుణాకర్ మిరుదొడ్డి మేజర్ గ్రామపంచాయతీకి ఉపసర్పంచిగా ఎన్నికయ్యారు. 7వ వార్డు నుంచి అధిక మెజార్టీతో గెలుపొందిన ఆయన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అండగా ఉండి, సేవ చేస్తానని భరోసా ఇచ్చారు. సాధారణ నేపథ్యం నుంచి ప్రజాప్రతినిధిగా ఎదిగిన కరుణాకర్ ప్రశంసలు అందుకుంటున్నారు.

News December 15, 2025

రెండో విడతలోనూ కాంగ్రెస్‌దే హవా

image

TG: రెండో విడత GP ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులదే హవా కొనసాగింది. మొత్తం 4,331 స్థానాల్లో ఏకగ్రీవాలతో కలుపుకొని 2,300కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు 1,100+, బీజేపీ 250+, ఇతరులు 480+ స్థానాల్లో గెలుపొందారు. మొత్తం 46.7 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోగా అత్యధికంగా భువనగిరి(91.2%), అత్యల్పంగా నిజామాబాద్(76.71%)లో పోలింగ్ నమోదైంది.

News December 15, 2025

కుంకుమ మన బలాన్ని పెంచుతుందా?

image

ఆలయాల ప్రాంగణంలో ప్రాణ శక్తికి సంబంధించిన పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రసరిస్తూ ఉంటాయి. ఈ ప్రకంపనలను కొన్ని వస్తువులు మాత్రమే గ్రహించగలవు. అందులో ‘కుంకుమ’ కూడా ఒకటి. ఇది గుడి పరిసరాల్లో ప్రసరిస్తున్న ఆ గాలిలోని ప్రాణశక్తిని గ్రహించి మన శరీరానికి పంపుతుంది. తద్వారా మన శరీరంలో శక్తి ప్రవాహం పెరుగుతుంది. మొత్తంగా కుంకుమ దేవాలయ సానుకూల శక్తిని మనలోకి తీసుకువస్తుంది.