News September 21, 2025
APSRTCలో 281 ఉద్యోగాలు

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. APSRTCలో 281 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం రీజియన్లలో డీజిల్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్ ఉద్యోగాలున్నాయి. టెన్త్, సంబంధిత ట్రేడుల్లో ITI ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ OCT 4. పూర్తి వివరాల కోసం <
#ShareIt
Similar News
News September 21, 2025
సా.5 గంటలకు మోదీ ప్రసంగం

ఈ సాయంత్రం 5 గం.కు ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాని ఏం చెబుతారనే దానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అర్ధరాత్రి నుంచి జీఎస్టీ అమల్లోకి రానున్న నేపథ్యంలో దానిపై ఏదైనా ప్రకటన చేస్తారా? లేదా అమెరికా H1B వీసాలపై మాట్లాడతారా? అనేది చూడాలి.
News September 21, 2025
పాడి పశువుల్లో కురమ జ్వరంతో నష్టాలు

పశువులకు అనేక రకాల సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. వర్షాకాలంలో బలిష్టమైన ఆంబోతులు, ఎద్దులు, ఆవులకు కురమ జ్వరం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి పశువులో 3 రోజులు మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ.. ఈ సమయంలో పశువులు బాగా నీరసించిపోతాయి. పాల దిగుబడి దాదాపు 80% వరకు తగ్గిపోతుంది. కురమ జ్వరం లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వెటర్నరీ నిపుణులు రాంబాబు కొన్ని సూచనలు చేశారు. అవేంటో చూద్దాం.
News September 21, 2025
పాడి పశువుల్లో కురమ జ్వరం లక్షణాలు

వైరల్ ఫీవర్ కురమ సోకితే పశువు తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంది. కాళ్లు పట్టేయడం, పడుకొని లేవలేకపోవటం, కదలకుండా ఉండటం వంటి లక్షణాలు పశువుల్లో కనిపిస్తాయి. దీంతో పాటు పశువుల్లో వణుకు, చెవులు వాలేసి ఉండటం, గురక పెట్టడం, పళ్లు నూరడం, నెమరు వేయకపోవటం, ఆకలి లేకపోవటం, మూలగడం, గొంతు నొప్పి, చొంగ పడటం, కుంటడం, కీళ్ల నొప్పులతో పాటు కండరాల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ముక్కు, కళ్ల నుంచి నీరు వస్తుంది.