News March 26, 2024
28న ఓయూ వార్షిక బడ్జెట్..

HYD ఓయూ వార్షిక బడ్జెట్-2024 ఈనెల 28న సెనేట్ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. ఆదాయం తగ్గి.. వ్యయం పెరిగిన తరుణంలో నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తోందని వర్సిటీ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ వేతనాలు పెన్షన్‌కు సరిపోవడం లేదన్నారు. ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News February 22, 2025
HYD: చందానగర్‌లో దారుణ హత్య

చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. స్థానికుల వివరాలు.. గోపినగర్‌కు చెందిన ఫక్రుద్దీన్, నజీర్ స్నేహితులు. రాత్రి 8 గంటల సమయంలో మాట్లాడే పని ఉందని స్నేహితులు గోపిచెరువు వద్దకు నజీర్‌ను తీసుకెళ్లారు. అక్కడ గొడవ జరగింది. ఫక్రుద్దీన్ దాడిలో నజీర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News February 22, 2025
యాక్సిడెంట్‌లో మేడిపల్లి MRO ఆఫీస్ ఉద్యోగి మృతి

రోడ్డు ప్రమాదంలో మేడిపల్లి తహశీల్దార్ కార్యాలయ ఉద్యోగి మృతిచెందారు. స్థానికుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన సందీప్(33) మేడిపల్లి మండల తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఇంటికి వెళ్లే క్రమంలో బైక్ అదుపుతప్పి ఒక్కసారిగా డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో సందీప్ అక్కడికక్కడే మృతిచెందారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News February 22, 2025
ఇబ్రహీంపట్నం: ఈ నెల 24న బడుల్లో వంట బంద్

రంగారెడ్డిలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ బంద్‌కు పిలుపునిచ్చింది. గురువారం CITU ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని ఇబ్రహీంపట్నం MEOకు మెమోరాండం అందజేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.10 వేల వేతనం ఇస్తామని హామీ ఇచ్చిందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్న తెలిపారు. కానీ, ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. ఇందుకు నిరసనగా ఈ నెల 24న బడుల్లో ‘వంట బంద్’ చేసి చలో కలెక్టరేట్‌లో పాల్గొంటామన్నారు.