News February 25, 2025

28న తిరుపతిలో జాబ్ మేళా

image

APSSDC ఆధ్వర్యంలో తిరుపతిలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(NAC)లో ఈనెల 28వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. 2 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ఇంటర్, ఏదైనా డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. నిరుద్యోగ అభ్యర్థుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News February 25, 2025

ఇటిక్యాల: పనుల పురోగతిపై పరిశీలన

image

ఇటిక్యాల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ తనిఖీ చేశారు. ప్రభుత్వ పథకాల అమలు తీరు, ఉపాధి హామీ పనులు, రాబోయే వేసవి కాలంలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తదితర పనులు పరిశీలించారు. అధికారులకు సంబంధిత పనుల పురోగతి గురించి ఆదేశాలు ఇచ్చారు. జిల్లా, మండల అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

News February 25, 2025

నిరుద్యోగులకు త్వరలోనే రూ.3000: CM

image

AP: 20 లక్షల ఉద్యోగాల కల్పన తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో వెల్లడించారు. రూ.6.50 లక్షల కోట్ల పెట్టుబడులకు MOU పూర్తి చేశామని, వీటి ద్వారా 5 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. అటు నిరుద్యోగులకు నెలకు రూ.3,000 భృతి త్వరలోనే అందిస్తామన్నారు. తాము అధికారంలోకి రాగానే 203 అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు అన్నం పెడుతున్నామన్నారు. రాష్ట్ర ప్రజలంతా గర్వపడేలా రాజధానిని నిర్మిస్తామన్నారు.

News February 25, 2025

సిగరెట్ తాగితే ఎముకలు బలంగా ఉండవు!

image

పొగ తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందని సిగరెట్ ప్యాకెట్‌పై ఉన్నప్పటికీ ఎవ్వరూ దానిని పట్టించుకోరు. అయితే, సిగరెట్ వల్ల శరీరంలోని ఎముకలు కూడా దెబ్బతింటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ధూమపానం ఎముకల బలాన్ని తగ్గిస్తుంది. వాటి పగుళ్లకు గురిచేస్తుంది. దీంతోపాటు ఎముకల నిర్మాణానికి కీలకమైన హార్మోన్లను దెబ్బతీస్తుంది. ధూమపానం మీ ఎముకలు దృఢంగా ఉండేందుకు అవసరమైన పోషకాలను కోల్పోయేలా చేస్తుంది’ అని తెలిపారు.

error: Content is protected !!