News April 27, 2024

29న అంబాజీపేటలో జగన్ బహిరంగ సభ: విప్పర్తి

image

ఈ నెల 29న పి.గన్నవరం నియోజకవర్గంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు.‌ పర్యటనలో భాగంగా అంబాజీపేట మండలం 4 రోడ్ల జంక్షన్ వద్ద మధ్యాహ్నం 12 గంటలకు సీఎం జగన్ బహిరంగ సభ జరుగుతుందని ‌నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వైసీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Similar News

News December 5, 2025

రాజమండ్రిలో నిలిచిన విమాన సర్వీసులు

image

పైలట్ల సమ్మె కారణంగా మధురపూడి విమానాశ్రయంలో సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మూడు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. గురువారం హైదరాబాద్‌ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు, 3.30 గంటలకు రావాల్సిన విమానాలు రద్దయ్యాయి. దీంతో ఇక్కడ నుంచి బయలుదేరాల్సిన రిటర్న్‌ సర్వీసులను అధికారులు నిలిపివేశారు. అలాగే దిల్లీ, హైదరాబాద్‌ నుంచి రావాల్సిన పలు సర్వీసులు సుమారు 4 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

News December 5, 2025

కొవ్వూరు ఉత్తమ పుష్కర కేంద్రంగా తీర్చిదిద్దాలి: ఎమ్మెల్యే

image

రానున్న పుష్కరాల నాటికి కొవ్వూరును సంపూర్ణంగా అభివృద్ధి చేసి, రాష్ట్రంలోనే ఉత్తమ పుష్కర కేంద్రంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు సీఎం చంద్రబాబుని కోరారు. గురువారం ఆయన సీఎంను కలిసి మొత్తం రూ.286.53 కోట్ల అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు అందజేశారు. పంచాయతీరాజ్, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో రోడ్లు, ఆలయ పునర్నిర్మాణం, స్నాన ఘాట్లు, నివాస సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.

News December 5, 2025

గోదావరి డెల్టాలో నీటి కొరత.. రబీ సాగు కష్టమే

image

గోదావరి డెల్టా ఆయకట్టులో ఈ ఏడాది రబీలో సాగునీటి కష్టాలు తప్పేటట్లు లేవని గోదావరి హెడ్ వర్క్స్ ఎస్ఈ కే. గోపీనాథ్ తెలిపారు. సాగు, తాగు, పరిశ్రమలకు కలిపి మొత్తం 93.26 టీఎంసీల నీరు అవసరం కాగా, ప్రస్తుతం 73.36 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉందని పేర్కొన్నారు. నదిలో సహజ జలాలు (9.45 టీఎంసీ), పోలవరం(20 టీఎంసీ), సీలేరు నుంచి (43.91 టీఎంసీ) అందుబాటులో ఉన్నా.. 19.90 టీఎంసీల నీటి కొరత ఏర్పడిందన్నారు.