News April 27, 2024

29న అంబాజీపేటలో జగన్ బహిరంగ సభ: విప్పర్తి

image

ఈ నెల 29న పి.గన్నవరం నియోజకవర్గంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు.‌ పర్యటనలో భాగంగా అంబాజీపేట మండలం 4 రోడ్ల జంక్షన్ వద్ద మధ్యాహ్నం 12 గంటలకు సీఎం జగన్ బహిరంగ సభ జరుగుతుందని ‌నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వైసీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Similar News

News April 12, 2026

రాజమండ్రి రైల్వేస్టేషన్ ప్లాట్ ఫామ్‌పై డెడ్ బాడీ..!

image

రాజమండ్రి రైల్వే స్టేషన్ రెండో నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై శనివారం సుమారు 64 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని జీఆర్పీ పోలీసులు గుర్తించారు. మృతుడు గోధుమ రంగు టీషర్ట్, డార్క్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. అతని వద్ద ‘మావూరి అప్పారావు, తండ్రి వీరన్న’ అని ఉన్న ఆసుపత్రి చీటి లభించింది. ఆచూకీ తెలిసిన వారు 9440779249 నంబరును సంప్రదించాలని ఇన్‌స్పెక్టర్ వై.వి. రమణ కోరారు.

News April 10, 2026

రాజమండ్రి ప్రజలకు గుడ్‌న్యూస్

image

రాజమండ్రి విమానాశ్రయం నుండి హైదరాబాద్‌కు Fly91 నూతన విమాన సర్వీసును రుడా (RUDA) ఛైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ నూతన విమాన సర్వీస్ ద్వారా నగరం నుంచి కనెక్టివిటీని పెంచడంతో పాటు వ్యాపార, వాణిజ్య & పర్యాటక రంగాల్లో మరింత వృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాజమండ్రిని రవాణా పరంగా అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు.