News April 25, 2024
29న ఓటర్ల తుది జాబితా విడుదల: కలెక్టర్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈనెల 29వ తేదీ ఓటర్లతో తుది జాబితా విడుదల చేస్తామని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా చెప్పారు. గురువారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఈ నెల 29న చిహ్నాలను కేటాయిస్తామన్నారు. బాపట్ల జిల్లాలో మొత్తం 147 నామినేషన్లు దాఖలు చేసినట్లు చెప్పారు.
Similar News
News December 13, 2025
మహిళల్లో మౌనం బలహీనత కాకూడదు: పెమ్మసాని

మహిళల్లో మౌనం బలహీనతగా మారిపోకూడదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో, డీఆర్‌డీఏ సౌజన్యంతో తుళ్లూరులో శనివారం నిర్వహించిన ‘లింగ సమానత్వ జాతీయ ప్రచార కార్యక్రమం’ నయీ చేతన 4.0లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కూడా పాల్గొన్నారు.
News December 13, 2025
మంగళగిరి: సీఎం సభా ఏర్పాట్లు పరిశీలించిన హోం మంత్రి

మంగళగిరి APSP 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో ఈ నెల 16న కానిస్టేబుల్ ఉద్యోగాలకు నూతనంగా ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. శనివారం సభా ఏర్పాట్లను హోంమంత్రి అనిత.. డీఐజీ ఏసుబాబు, ఎస్పీ వకుల్ జిందాల్, బెటాలియన్ కమాండెంట్ నగేశ్ బాబులతో కలిసి పరిశీలించారు. అభ్యర్థులు వారి కుటుంబాలతో కలిసి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె చెప్పారు.
News December 13, 2025
మంగళగిరి: ఆ అధికారి ఆఫీసుకు వచ్చి ఏడాది దాటింది!

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ (మంగళగిరి) కార్యాలయం సబార్డినేటర్ మహ్మద్ ఫజల్-ఉర్-రహమాన్ విధులకు గైర్హాజరవుతున్న నేపథ్యంలో సహాయ సంచాలకులు సీరియస్ అయ్యారు. గతేడాది జూన్ నుంచి నేటి వరకు ఎటువంటి అనుమతి లేకున్నప్పటికీ విధులకు హాజరు కావడం లేదని చెప్పారు. ఇప్పటి వరకు 3 సార్లు నోటీసులు జారీచేసినప్పటికీ స్పందించలేదన్నారు. 15 రోజుల లోపులిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని, లేకుంటే సర్వీస్ నుంచి తొలగిస్తామన్నారు.


